తెలంగాణ

telangana

ETV Bharat / entertainment

అనారోగ్యం రూమర్స్​కు చెక్​ - అజిత్​కు అసలు ఏం జరిగిందంటే ? - Actor Ajith kumar health issue

Actor Ajith Kumar Health Issue : ఇటీవలే హీరో అజిత్ అనారోగ్యంపై వచ్చిన వార్తలన్నింటికీ ఆయన టీమ్ చెక్ పెట్టింది. అందులో ఏ మాత్రం వాస్తవాలు లేవంటూ కొట్టిపారేసింది. ఇంతకీ అజిత్​కు ఏం జరిగిందంటే ?

Actor Ajith Kumar Health Issue
Actor Ajith Kumar Health Issue

By ETV Bharat Telugu Team

Published : Mar 8, 2024, 3:43 PM IST

Updated : Mar 8, 2024, 4:04 PM IST

Actor Ajith Kumar Health Issue :ఇటీవలేకోలీవుడ్ స్టార్ హీరో అజిత్​ కుమార్ అనారోగ్యం గురించి వస్తున్న రూమర్స్​ అన్నింటినీ తాజాగా ఆయన టీమ్ కొట్టి పారేసింది. వాటన్నింటిలోనూ ఏ మాత్రం వాస్తవం లేదంటూ అజిత్​ మేనేజర్ సురేశ్​ చంద్ర మీడియాకు క్లారిటీ ఇచ్చారు. అయితే రెగ్యూలర్​ చెకప్ తీసుకున్న మాట నిజమే అని తెలిపారు.

అందులో భాగంగా జరిగిన స్కాన్​లో అజిత్​ చెవి వెనక భాగాన్న ఓ చిన్నపాటి వాపు వచ్చిందని, అందుకు కావాల్సిన చికిత్సను డాక్టర్స్ వెంటనే ఇచ్చినట్లు పేర్కొన్నారు. దాని వల్ల ఆయన పనులకు ఎటువంటి అంతరాయం జరగలేదని అన్నారు. ప్రస్తుతం ఆయన పూర్తిగా ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.

ఇదీ జరిగింది :చెన్నైలోని అపోలో హాస్పిటల్​లో అజిత్​ చేరారంటూ పలు వార్తలు ట్రెండ్ అయ్యాయి. ఆయనకు బ్రెయిన్​ టూమర్​ ఉందంటూ రూమర్స్ కూడా వచ్చాయి. ఇందుకోసమే ఆయన ఆస్పత్రి వెళ్లినట్లు పలు కథనాలు చక్కర్లు కొట్టాయి. దీంత ఫ్యాన్స్ ఆందోళన చెందారు. ఆయనకు ఏమైందంటూ కంగారు పడ్డారు. కానీ ఆయన సన్నిహిత వర్గాలు అప్పుడే ఆయనకు ఏం కాలేదంటూ క్లారిటీ ఇచ్చింది. నేడు ( మార్చి 8) మేనేజర్ ఇచ్చిన క్లారిటీతీ ఈ విషయం ఓ కొలిక్కొచ్చింది. దీంతో తల అభిమానులు ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నారు.

Ajith Upcoming Movies :అజిత్ ప్రస్తుతం 'విడాముయార్చి' అనే మూవీలో నటిస్తున్నారు. ఫుల్​ ఆన్​ యాక్షన్ మోడ్​లో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. మాగిజ్ తిరుమేని ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. లైకా ప్రొడ‌క్ష‌న్ సంస్థ ఈ చిత్రాన్ని దాదాపు రెండు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో నిర్మిస్తోంది.

మరోవైపు 'విడాముయర్చి' ఓటీటీ రైట్స్​ను ప్రముఖ స్ట్రీమింగ్ ప్లాట్​ఫామ్​ నెట్​ఫ్లిక్స్​ సొంతం చేసుకుంది. దాదాపు రూ. 60కోట్లకు ఆ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమాలో అజిత్ సరసన కోలీవుడ్ బ్యూటీ త్రిష హీరోయిన్​గా నటిస్తున్నారు. తమిళంలో ఈ ఇద్దరి జోడీ మంచి ఫేమస్. వీరిద్ద‌రి క‌ల‌యిక‌లో ఇప్ప‌టివ‌ర‌కు ఆరు సినిమాలొచ్చాయి. చివ‌ర‌గా వీరిద్దరు క‌లిసి 2015లో ఎన్నై అరిందాళ్ అనే చిత్రంలో నటించారు. మళ్లీ తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత కలిసి ఇప్పుడు విదా మూయార్చిలో నటిస్తున్నారు.

Hero Ajith House : హీరో అజిత్​ ఇల్లు కూల్చివేత!.. ఏం జరిగిందంటే?

హీరో అజిత్​ అలా చేస్తారా.. ఆ సీక్రెట్ చెప్పేసిన త్రిష.. తెలిస్తే షాక్​ అవ్వాల్సిందే!

Last Updated : Mar 8, 2024, 4:04 PM IST

ABOUT THE AUTHOR

...view details