68th Filmfare Awards : 2023 ఏడాదికిగానూ ప్రతిష్టాత్మక 68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ వేడుక తాజాగా గ్రాండ్‌గా జరిగింది. అందులో సౌత్ నుంచి (తెలుగు) 'ఆర్ఆర్ఆర్' ఉత్తమ చిత్రంగా అవార్డు దక్కించుకోగా, బెస్ట్ డైరెక్టర్‌గా ఎస్.ఎస్.రాజమౌళి పురస్కారాన్ని దక్కించుకున్నారు. అయితే ఉత్తమ నటుడిగా మాత్రం ఇద్దరు ఎంపికయ్యారు. 'ఆర్ఆర్ఆర్'లోని తమ నటనకుగానూ జూనియర్ ఎన్టీఆర్, రామ్‌చరణ్‌ను సంయుక్తంగా ఈ అవార్డు వరించింది.
'నాటు నాటు'కుగానూ కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, కొమురం భీముడో సాంగ్ పాడినందుకు యంగ్ సింగర్ కాలభైరవ, అలాగే ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ లిస్ట్‌లో 'ఆర్ఆర్ఆర్' అవార్డులు సొంతం చేసుకుంది. దీంతో పాటు బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ చేసినందుకు సాబు శిరిల్ను ఫిల్మ్‌ఫేర్ వరించింది.
మరోవైపు దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ నటించిన క్లాసికల్ హిట్ 'సీతారామం' మూవీకి కూడా అవార్డుల పంట పండింది. ఉత్తమ నటడు క్రిటిక్స్, ఉత్తమ నటి క్రిటిక్స్, ఉత్తమ చిత్రం క్రిటిక్స్ ఇలా ఈ మూవీ ఏకంగా ఐదు అవార్డులు దక్కించుకుంది.
ముఖ్యంగా 'కానున్న కల్యాణం' సాంగ్‌కు చక్కటి సాహిత్యాన్ని అందించినందుకు దివంగత లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామ శాస్త్రీకి అవార్డు వచ్చింది. ఇక పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్', సాయిపల్లవి 'విరాటపర్వం' కూడా ఫిల్మ్‌ఫేర్‌లో పురస్కారాలు అందుకున్నాయి.
ఫిల్మ్‌ఫేర్-2023 విజేతలు వీళ్లే
- ఉత్తమ చిత్రం (క్రిటిక్స్) - సీతారామం (హను రాఘవపూడి)
- ఉత్తమ నటుడు (క్రిటిక్స్) - దుల్కర్ సల్మాన్ (సీతారామం)
- ఉత్తమ నటి - మృణాల్ ఠాకూర్ (సీతారామం)
- ఉత్తమ నటి (క్రిటిక్స్) -సాయి పల్లవి( విరాట్ పర్వం)
- ఉత్తమ సహాయ నటుడు - రానా దగ్గుబాటి (భీమ్లా నాయక్)
- ఉత్తమ సహాయ నటి - నందితా దాస్ (విరాట్ పర్వం)
- ఉత్తమ సాహిత్యం - సిరివెన్నెల సీతారామశాస్త్రి (సీతారామం)
- ఉత్తమ నేపథ్య గాయకుడు - కాలభైరవ (కొమురం భీముడో- ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ నేపథ్య గాయని - చిన్మయి శ్రీపాద (ఓ ప్రేమ -సీతారామం)
- ఉత్తమ మ్యూజిక్ ఆల్బమ్ - ఎం.ఎం.కీరవాణి (ఆర్ఆర్ఆర్)
- ఉత్తమ కొరియోగ్రఫీ -ప్రేమ్ రక్షిత్ (నాటు నాటు- ఆర్ఆర్ఆర్)
- బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ - సాబు శిరిల్ (ఆర్ఆర్ఆర్)
ఎన్టీఆర్ పురస్కారాలు- బేబీకి 2 అవార్డులు- మురళీ మోహన్‌కు లైఫ్ ఎఛీవ్మెంట్!
న్యూయార్క్‌లో 'హాయ్ నాన్న' సందడి - బెస్ట్ యాక్టర్ సహా 11 అవార్డులు సొంతం - Hi Nanna Awards