తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

న్యూ జాబ్​ ట్రెండ్​​ - ' ప్రమోషన్ ఇస్తారు - కష్టపడి పని చేయ్​ - ఫలితం ఆశించకు!' - Dry Promotion

What Is Dry Promotion : గత కొన్నేళ్లుగా గ్లోబల్ జాబ్ మార్కెట్లో కొత్త పోకడలు నిరంతరం గమనిస్తూనే ఉన్నాం. వర్క్ ఫ్రమ్​ హోం, మూన్ లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వంటి కొత్త ధోరణులు జాబ్ మార్కెట్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. తాజాగా డ్రై ప్రమోషన్ ఆ జాబితాలో చేరింది. ఇంతకూ డ్రై ప్రమోషన్ అంటే ఏమిటో తెలుసుకుందామా?

Dry promotion Meaning
What is Dry promotion

By ETV Bharat Telugu Team

Published : Apr 24, 2024, 10:14 AM IST

What Is Dry Promotion : గ్లోబల్ జాబ్ మార్కెట్లో ఎప్పటికప్పుడు సరికొత్త ట్రెండ్స్​ వచ్చేస్తున్నాయి. ఉద్యోగాలు చేసే విధానంలో మార్పు వస్తోంది. మారుతున్న టెక్నాలజీ, ఉద్యోగుల అవసరాలకు అనుగుణంగా కొత్త ధోరణులు ఎన్నో పుట్టుకొస్తున్నాయి. వర్క్ ఫ్రం హోం నుంచి మూన్ లైటింగ్, కాఫీ బ్యాడ్జింగ్, క్వైట్ క్విటింగ్ వరకు ఈ జాబితా చాలా పొడవుగా ఉంది. ఇప్పుడు కొత్త ట్రెండ్ పుట్టుకొచ్చింది. ఈ కొత్త ట్రెండ్ పేరే "డ్రై ప్రమోషన్". డ్రై ప్రమోషన్ అంటే ఉద్యోగులకు జీతం పెంచకుండా ప్రమోషన్ ఇవ్వడం. మరో మాటలో చెప్పాలంటే, ఉద్యోగి టైటిల్ మారినప్పుడు, పనిభారం పెరుగుతుంది, బాధ్యతలు పెరుగుతాయి. కానీ జీతం మాత్రం పెరగదు.

ప్రమోషన్ ఓకే - మరి జీతం సంగతి!
సాధారణంగా ఉద్యోగంలో ప్రమోషన్ అంటే బాధ్యతలతోపాటు వేతనాలు, ఇతర ప్రోత్సాహకాలు కూడా పెరుగుతాయి. కానీ అవేవీ లేకుండా కేవలం బాధ్యతలను మాత్రమే పెంచితే దాన్ని 'డ్రై ప్రమోషన్' అని అంటారు. సింపుల్​గా చెప్పాలంటే, కంపెనీలో డెసిగ్నేషన్ మారడం వల్ల పనిభారం, బాధ్యతలు పెరుగుతాయి. కానీ వేతనాలు, ప్రోత్సహకాలు మాత్రం పెరగవు.

ప్రముఖ కన్సల్టెంట్ పెర్ల్ మేయర్ నివేదిక ప్రకారం, 13% కంటే ఎక్కువ మంది యజమానులు తమ ఉద్యోగులకు జీతాలు పెంచుకుండా ప్రమోషన్లు ఇచ్చేందుకే మొగ్గుచూపుతున్నారు. వాల్ స్ట్రీట్ జర్నల్ నివేదిక ప్రకారం, 2018లో ఈ సంఖ్య 8% మాత్రమే. 900 కంపెనీలపై జరిపిన సర్వేలో, 2023తో పోలిస్తే 2024లో తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు తేలింది. సంస్థలు అవలంభిస్తున్న ఈ కొత్త ట్రెండ్ వల్ల చాలా మంది ఉద్యోగులు సంతోషంగా లేరు. కంపెనీలు ఖర్చు తగ్గింపు చర్యలపై దృష్టి సారించడం వల్లే ఈ డ్రై ప్రమోషన్లు పెరుగుతున్నాయి. ఈ పదోన్నతులు ఉద్యోగిని ఆర్థిక అనిశ్చితి వైపు నడిపిస్తాయి. ఇంతకు ముందు కార్మికుల కొరతను ఎదుర్కొనేందుకు, ఉద్యోగులను కొనసాగించేందుకు కంపెనీలు కచ్చితంగా జీతాలను పెంచేవి. కానీ ఇప్పుడు అది పూర్తిగా మారిపోయింది.

ఈ కొత్త ట్రెండ్‌కి సాక్ష్యం సోషల్ మీడియానే అని చెప్పవచ్చు. ఇక్కడ చాలా మంది ఉద్యోగులు తమకు వచ్చిన డ్రై ప్రమోషన్​ అనుభవాలను నెటిజన్లతో పంచుకుంటున్నారు. ఉదాహరణకు, గత సంవత్సరం షేర్ చేసిన Reddit థ్రెడ్‌లో, ఒక వ్యక్తి, తాను కేవలం ప్రమోషన్ మాత్రమే పొందినట్లు చెప్పారు. వేతనాలు ఏ మాత్రం పెంచలేదని స్పష్టం చేశాడు.

న్యూ ట్రెండ్స్​
ఆఫీసుకు తప్పనిసరిగా రావాలని కంపెనీలు ఆదేశించడాన్ని వ్యతిరేకిస్తూ ఉద్యోగులు కాఫీ బ్యాడ్జింగ్ విధానాన్ని అవలంబించిన సంగతి తెలిసిందే. రమ్మన్నారు కదాని అలా వచ్చి కాసేపు కాఫీ తాగి మేనేజర్లు, హెచ్ఆర్​ల దృష్టిలో పడి ఇంటికి వెళ్లడాన్నే కాఫీ బ్యాడ్జింగ్​గా వ్యవహరించారు. యాజమాన్యానికి తెలియకుండా రెండో ఉద్యోగం చేయడాన్ని మూన్ లైటింగ్ అంటారు. కేవలం అప్పగించిన బాధ్యతలకు మాత్రమే పరిమితమై, ఇతర పనుల నుంచి తప్పించుకోవడాన్ని క్వైట్ క్విటింగ్​గా పేర్కొంటున్నారు. ఈ విధంగా కార్పొరేట్ రంగంలో అనేక పదాలు ఇటీవల తెరపైకి వచ్చాయి.

కృత్రిమ మేధ (AI) ఎంత డెవలప్ అయినా - ఈ జాబ్స్​ మాత్రం సేఫ్​! - Jobs That Are Safe From AI

పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఈ 10 టిప్స్ పాటిస్తే ఉద్యోగం గ్యారెంటీ! - Exam Preparation Tips

ABOUT THE AUTHOR

...view details