VSSC Apprentice Recruitment 2024 :కేరళ రాష్ట్రం తిరువనంతపురంలోని 'విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్' (వీఎస్‌ఎస్‌సీ) 2023-24 సంవత్సరానికి టెక్నీషియన్/ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. భారత అంతరిక్ష పరిశోధన సంస్థలో పనిచేయాలని ఆశించే అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు.
అప్రెంటీస్ పోస్టుల వివరాలు
- గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ - 50 పోస్టులు
- టెక్నీషియన్ అప్రెంటిస్ - 49 పోస్టులు
- మొత్తం పోస్టులు - 99
విభాగాలు :మెకానికల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్, మెటలర్జీ, హోటల్ మేనేజ్‌మెంట్/ క్యాటరింగ్ టెక్నాలజీ, కమర్షియల్ ప్రాక్టీస్.
విద్యార్హతలు : అభ్యర్థులు సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీలో క్వాలిఫై అయ్యుండాలి.
వయో పరిమితి :2024 ఏప్రిల్ 30 నాటికి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌లకు 28 ఏళ్లు, టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు 30 ఏళ్లు మించి ఉండకూడదు.
స్టైపెండ్ :గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌కు నెలకు రూ.9000 ఇస్తారు. టెక్నీషియన్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8000 అందిస్తారు.
ఎంపిక ప్రక్రియ : డిప్లొమా లేదా డిగ్రీలో సాధించిన మార్కులు + రూల్ ఆఫ్ రిజర్వేషన్ఆ ధారంగా అభ్యర్థులను అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.
సెలక్షన్ డ్రైవ్ తేదీ :2024 మే 08
సెలక్షన్ జరిగే వేదిక : వీఎస్‌ఎస్‌సీ గెస్ట్ హౌస్, ఏటీఎఫ్ ఏరియా, వెలి, తిరువనంతపురం జిల్లా, కేరళ.
***
టెక్నికల్ గ్రాడ్యుయేట్లకు ఇండియన్ ఆర్మీ ఆహ్వానం - దరఖాస్తుకు మరికొద్ది రోజులే ఛాన్స్!
ఇండియన్ ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలని ఆశించే వారందరికీ గుడ్ న్యూస్. ఇండియన్ ఆర్మీ బీఈ, బీటెక్ చేసిన (టెక్నికల్ గ్రాడ్యుయేట్) అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఆసక్తి ఉన్న వారు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్ఎస్బీ) ఇంటర్వ్యూ నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఇలా ఎంపికైన అభ్యర్థులకు గ్రాడ్యుయేట్ కోర్స్ (టీజీసీ)లో శిక్షణ ఇస్తుంది. శిక్షణ అనంతరం లెఫ్టినెంట్ హోదాతో విధుల్లోకి తీసుకుంటుంది.
పోస్టుల వివరాలు
- సివిల్ - 7
- కంప్యూటర్ సైన్స్ - 7
- ఎలక్ట్రికల్ - 3
- ఎలక్ట్రానిక్స్ - 4
- మెకానికల్ - 7
- ఇతర విభాగాల్లో - 2
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 మే 9 మధ్యాహ్నం 3 గంటల వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.
'రెజ్యూమ్ ప్రిపేర్ చేస్తున్నారా? ఈ 3 తప్పులు అస్సలు చేయకండి' - గూగుల్ మాజీ రిక్రూటర్ - Resume Writing Tips
AI ఎంత డెవలప్ అయినా ఈ స్కిల్ ఉంటే చాలు - జాబ్ గ్యారెంటీ! - Best Job Skills