Top Online Learning Websites List :కృత్రిమ మేధస్సు(ఏఐ), కంప్యూటర్ సైన్స్, ఆరోగ్యం, విద్య, చరిత్ర, వంటి వాటి కోసం తెలుసుకోవాలని ప్రస్తుతం కాలంలో చాలా మంది ఉత్సాహం చూపిస్తుంటారు. పలు కోర్సులను ఇంటర్నెట్ ద్వారా ఆన్లైన్లో నేర్చుకోవాలనుకుంటారు. అలాంటి వెబ్‌సైట్స్‌లో కొన్ని ఉచితంగా క్లాసులు అందిస్తాయి. మరికొన్నింటికి ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ప్రొఫెషనల్ సర్టిఫికెట్‌ను సైతం అందిస్తాయి. అలాంటి బెస్ట్ 30 ఆన్‌లైన్ లెర్నింగ్ సైట్స్ ఎంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. అకడమిక్ ఎర్త్(Academic Earth)
అకడమిక్ ఎర్త్ అనేది ప్రపంచంలోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాలు, కాలేజీల ఉచిత ఆన్‌లైన్ కోర్సుల సమాచారాన్ని ఇస్తుంది. ఈ లెర్నింగ్ సైట్ 2009లో ప్రారంభమై ఇప్పటికీ విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సైట్లో చాలా సబ్జెక్ట్లపై కోర్సులు ఉంటాయి. మీకు కావాల్సిన యూనివర్సిటీ పేరు టైప్ చేసి అవి అందించే కోర్సులు నేర్చుకోవచ్చు.
2. అలిసన్ లెర్నింగ్ పాత్స్(Alison Learning Paths)
అలిసన్ లెర్నింగ్ పాత్స్ అనేది పలు రంగాలకు చెందిన నిపుణులు రూపొందించిన ఉచిత ఆన్‌లైన్ కోర్సులను అందిస్తుంది. మార్కెటింగ్, ఆరోగ్యం, సైన్స్ అండ్ టెక్నాలజీ వంటి కోర్సులను నేర్చుకోవచ్చు.
3. బెటర్ ఎక్స్‌ప్లెయిన్డ్(BetterExplained)
మ్యాథ్స్ నేర్చుకోవాలనుకునేవారికి బెటర్ ఎక్స్ ప్లెయిన్డ్ లెర్నింగ్ సైట్ పనికొస్తుంది. ఇందులో ఆన్ లైన్ క్లాసులు ఉచితం. మీకు పాఠ్యపుస్తకాల పీడీఎఫ్, వీడియో లెస్సన్స్, క్విజ్లు వంటివి కావాలంటే కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
4. కాన్వాస్ నెట్ వర్క్(Canvas Network)
కాన్వాస్ నెట్వర్క్ అనేది అధ్యాపకులకు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులను అందిస్తుంది. ఇందులో పలు భాషల్లో కోర్సులను చేయవచ్చు. ఇది టీచర్స్ కు ఉపయోగకరంగా ఉంటుంది.
5. కానగీ మెల్లన్ ఓపెన్ లెర్నింగ్ ఇనిషియేటివ్(Carnegie Mellon Open Learning Initiative)
అమెరికాలోని కానగీ మెల్లన్ యూనివర్సిటీ బిజినెస్ మేనేజ్మెంట్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్, కెమిస్ట్రీతో పాటు ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోర్సులను అందుబాటులో ఉంచుతుంది. ఈ లెర్నింగ్ సైట్లో ఉచితంగా కొన్ని కోర్సులను నేర్చుకోవచ్చు.
6. కోడ్‌కాడెమీ(Codecademy)
ఫ్రీలాన్స్ కెరీర్‌ను ఎంచుకునేవారికి కోడెకాడెమీ ఉపయోగపడుతుంది. పైథాన్, రూబీతో సహా పలు కంప్యూటర్ కోర్సులను నేర్చుకోవచ్చు.
7. కోర్సెరా(Coursera)
ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఆన్ లైన్ డిగ్రీని సంపాదించుకోవడానికి కోర్సెరా ఈ లెర్నింగ్ సైట్ ఉపయోగపడుతుంది.
8. డ్రాస్పేస్(Drawspace)
డ్రాయింగ్, పెయింటింగ్ నేర్చుకోవాలనుకునేవారికి డ్రాస్పేస్ లెర్నింగ్ సైట్ బాగా ఉపయోగపడుతుంది. ఆర్టిస్ట్‌గా మారాలనుకున్నవారికి ఈ సైట్ బాగా యూజ్ అవుతుంది.
9. ఈడీఎక్స్(edX)
ఈడీఎక్స్ అనేది హార్వర్డ్ యూనివర్సిటీ, మసాటుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కలిసి స్థాపించిన ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్. కంప్యూటర్ సైన్స్, ఇంజినీరింగ్, సైకాలజీ, రైటింగ్, ఎలక్ట్రానిక్స్, బయాలజీ, మార్కెటింగ్ వంటి సబ్జెక్ట్‌లలో కోర్సులు చేయవచ్చు.
10. ఫ్యూచర్ లెర్న్ ( FutureLearn)
ఫ్యూచర్ లెర్న్ సైట్ గ్లాస్గో విశ్వవిద్యాలయం, కింగ్స్ కాలేజ్ వంటి 260కి పైగా అగ్రశ్రేణి యూనివర్సిటీల్లోని ఆన్ లైన్ కోర్సులను అందిస్తుంది. కాపీ రైటింగ్, ఏఐ, బయోకెమిస్ట్రీ, పర్సనాలిటీ డెవలప్ మెంట్ వంటి కోర్సులను చేయవచ్చు.
11. జనరల్ అసెంబ్లీ(eneral Assembly)
డిజైన్, వ్యాపారం, సాంకేతికతపై కోర్సు చేయాలనుకునేవారికి జనరల్ అసెంబ్లీ బాగా ఉపయోగపడుతుంది.
12. జీఎఫ్ సీ గ్లోబల్(GFCGlobal)
జీఎఫ్‌సీ గ్లోబల్ అనేది గత 20 ఏళ్లుగా ఫైనాన్స్, ఫ్రీలాన్స్ వర్క్, ఇంటర్నెట్, కంప్యూటర్ స్కిల్స్‌పై ఉచిత తరగతులు నిర్వహిస్తోంది.
13. హాక్ డిజైన్(Hack Design)
డిజైన్‌ను వృత్తిగా ఎంచుకున్నవారికి హాక్ డిజైన్ పనికొస్తుంది.
14. హార్వర్డ్ ఆన్ లైన్ కోర్సులు(Harvard Online Courses)
బిజినెస్ డెవలప్మెంట్, సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లపై ఆసక్తి ఉండేవారి కోసం హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఈ కోర్సుల మెటీరియల్‌ను ఆన్లైన్లో అందుబాటులో ఉంచుతుంది.