తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

నిరుద్యోగులకు గుడ్ న్యూస్​ - 4187 పోస్టులతో SSC భారీ నోటిఫికేషన్​! - degree jobs 2023

SSC Recruitment 2024 : నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్​. స్టాఫ్ సెలక్షన్ కమిషన్​ (ఎస్​ఎస్​సీ) దిల్లీ పోలీస్​, సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్​ (CAPF)లోని 4187 సబ్​-ఇన్​స్పెక్టర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SSC sub inspector Jobs 2024
SSC Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Mar 6, 2024, 10:53 AM IST

SSC Recruitment 2024 :స్టాఫ్​ సెలక్షన్ కమిషన్​ ఈ ఏడాది దిల్లీ పోలీసు, సెంట్రల్​ ఆర్మ్​డ్​ పోలీసు ఫోర్సెస్​ల్లోని సబ్​-ఇన్​స్పెక్టర్​ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

ఉద్యోగాల వివరాలు

  • సెంట్రల్ ఆర్మ్​డ్​ పోలీస్​ ఫోర్సెస్​ : 4001 సబ్​-ఇన్​స్పెక్టర్ (జీడీ)​ పోస్టులు
  • దిల్లీ పోలీస్ (పురుషులు)​ : 125 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​)
  • దిల్లీ పోలీస్ (మహిళలు)​ : 61 సబ్​-ఇన్​స్పెక్టర్​ (ఎగ్జిక్యూటివ్​)
  • మొత్తం పోస్టులు : 4,187

నోట్ : సెంట్రల్​ ఆర్మ్​డ్ ఫోర్సెస్​లో బీఎస్​ఎఫ్​, సీఐఎస్​ఎఫ్​, సీఆర్​పీఎఫ్​, ఐటీబీపీ, ఎస్​ఎస్​బీ ఉంటాయి.

విద్యార్హతలు
అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యా సంస్థలో డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. అలాగే నిర్దిష్ట శారీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి.

వయోపరిమితి
అభ్యర్థుల వయస్సు 2024 ఆగస్టు 1 నాటికి 20 ఏళ్ల నుంచి 25 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

  • జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లించాలి.
  • మహిళలు, ఎక్స్-సర్వీస్​మెన్​, ఎస్టీ, ఎస్సీలు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.

ఎంపిక ప్రక్రియ
అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి శారీరక దారుఢ్య పరీక్ష (పీఈటీ), ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్​ (పీఎస్​టీ) చేస్తారు. వీటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులకు డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ చేసి, అర్హులైన వారిని సబ్​-ఇన్​స్పెక్టర్​ పోస్టులకు ఎంపిక చేస్తారు.

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (పురుషులు)

  • 100 మీటర్ రేస్​ - 16 సెకెన్లు
  • 1.6 కి.మీ రేస్​ - 6.5 నిమిషాలు
  • 3.65 మీటర్స్ లాంగ్​ జంప్​ - 3 ఛాన్సులు
  • 1.2 మీటర్స్ హైజెంప్ - 3 ఛాన్సులు
  • షాట్​ పుట్ (16 Lbs) - 4.5 మీటర్స్​, 3 ఛాన్సులు

ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ (మహిళలు)

  • 100 మీటర్ రేస్​ - 18 సెకెన్లు
  • 800 మీ రేస్​ - 4 నిమిషాలు
  • 2.7 మీటర్స్ (9 అడుగులు) లాంగ్​ జంప్​ - 3 ఛాన్సులు
  • 0.9 మీటర్స్ (3 అడుగులు) హైజెంప్ - 3 ఛాన్సులు

జీతభత్యాలు
సబ్​-ఇన్​స్పెక్టర్​లకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఉంటుంది.

పరీక్ష కేంద్రాలు

  • ఏపీలోని పరీక్ష కేంద్రాలు : విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, కాకినాడ, గుంటూరు, చీరాల, విజయవాడ, నెల్లూరు, కర్నూలు, తిరుపతి
  • తెలంగాణలోని పరీక్ష కేంద్రాలు : హైదరాబాద్​, వరంగల్​, కరీంనగర్​

ముఖ్యమైన తేదీలు

  • దరఖాస్తులు స్వీకరణ ప్రారంభం :2024 మార్చి 4
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 మార్చి 28
  • దరఖాస్తు సవరణకు అవకాశం : 2024 మార్చి 30, 31 తేదీలు
  • కంప్యూటర్​ బేస్డ్​ టెస్ట్ : మే 9, 10, 13 తేదీలు

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - RPFలో 4600 ఎస్​ఐ & కానిస్టేబుల్ పోస్టుల భర్తీ - అప్లై చేసుకోండిలా!

క్రియేటివ్ జాబ్స్ చేయాలా? డబ్బులు కూడా బాగా సంపాదించాలా? ఈ టాప్​-5 కెరీర్​ ఆప్షన్స్​పై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details