SSC GD Recruitment 2024 Notification :దేశ రక్షణలో భాగమవ్వాలనుకునే యువతకు గుడ్ న్యూస్. వివిధ విభాగాల్లో భారీ సంఖ్యలో కానిస్టేబుల్ (జీడీ) నియామకాల ప్రక్రియకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) సిద్ధమవుతోంది. ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం (2024-25) ఈ నోటిఫికేషన్ వెలువడాల్సి ఉంది. అయితే పాలనా వ్యవహారాల కారణాల వల్ల సెప్టెంబరు 5కు వాయిదా వేసింది. ఈ విషయాన్ని ఎస్ఎస్సీ అధికారికంగా తెలిపింది. మరెందుకు ఆలస్యం ఎస్ఎస్సీ జీడీ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడం ఎలా? ఫీజు? వయో పరిమితి? తదితర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏయే పోస్టులు భర్తీ అవుతాయంటే?
బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అసోం రైఫిల్స్‌లో రైఫిల్ మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను ఎస్ఎస్సీ భర్తీ చేయనుంది.
అభ్యర్థుల ఎంపిక ఎలా?
రాత పరీక్ష, ఫిజికల్ ఎఫీషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
అర్హతలు
ప్రభుత్వ గుర్తింపు పొందిన బోర్డు నుంచి మెట్రిక్యులేషన్ లేదా పదో తరగతి పాసై ఉండాలి. పురుష అభ్యర్థుల ఎత్తు 170 సెం.మీ.లకు, మహిళా అభ్యర్థుల ఎత్తు 157 సెం.మీ.లకు తగ్గకూడదు. అభ్యర్థుల వయసు 18- 23 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయసు సడలింపు ఉంటుంది.