SSC CGL Notification 2024 : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కల్పన సంస్థ స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC).. ఏటా వివిధ కేంద్ర విభాగాలు, వాటి అనుబంధ కార్యాలయాల్లో గ్రూప్-బి, గ్రూప్-సి ఖాళీల భర్తీకి కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్ (సీజీఎల్‌ఈ) నిర్వహిస్తోంది. ఈ క్రమంలోనే.. నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. 17,727 ఖాళీలతో సీజీఎల్‌ఈ - 2024 నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనికి సంబంధించి విద్యార్హతలు, వయసు, జీతభత్యాలు, దరఖాస్తు తేదీలతో పాటు ఇతర వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
విద్యార్హతలు(Eligibility) : సీజీఎల్ఈ-2024 నోటిఫికేషన్‌లోని పోస్టులకు ఏ బ్యాచిలర్ డిగ్రీ ఉన్నవారైనా అప్లై చేసుకోవచ్చు. అయితే.. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్‌కు మాత్రం డిగ్రీలో స్టాటిస్టిక్స్ లేదా ఇంటర్ మ్యాథ్స్‌లో 60 శాతం మార్కులు వచ్చి ఉండాలి. స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్‌కు డిగ్రీలో స్టాటిస్టిక్స్ తప్పనిసరి అనే విషయాన్ని అభ్యర్థులు గుర్తుంచుకోవాలి.
వయో పరిమితి(Age Limit) : ఆగస్టు 1, 2024 నాటికి గ్రూప్-బీలో.. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు 32 ఏళ్లు, మిగిలిన పోస్టులకు 30 సంవత్సరాలలోపు వయసు కలిగి ఉండాలి. అలాగే.. గ్రూప్-సీలో ఇన్‌కమ్ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ పోస్టుకు 30 సంవత్సరాలు. మిగిలినవాటికి 27 ఏళ్లలోపు వయసు ఉన్నవారే అర్హులు. ఎస్సీ, ఎస్టీలకు 5 సంవత్సరాలు, ఓబీసీలకు 3 ఏళ్లు, దివ్యాంగులకు వారి కేటరిగీ ప్రకారం పది నుంచి పదిహేనేళ్లు గరిష్ఠ వయసులో మినహాయింపు ఉంది.
జీతభత్యాలు(Salary) :ప్రస్తుత నోటిఫికేషన్లో వివిధ కేంద్ర విభాగాల్లో గ్రూప్-బీ, గ్రూప్-సీలో పలు హోదాలతో ఉద్యోగాలు ఉన్నాయి. ఎంపికైన పోస్టు ప్రకారం.. లెవెల్-4, లెవెల్-5, లెవెల్-6, లెవెల్-7 శాలరీలు వీరికి ఇస్తారు. మొదటి నెల నుంచే సుమారుగా.. లెవెల్-4లో ఉన్నవాళ్లు రూ.45000, లెవెల్-5వారు రూ.55000, లెవెల్-6తో రూ.65,000, లెవెల్-7 అయితే రూ.80,000 జీతం పొందుతారు.
పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్నారా? ఇలా చదివితే ఉద్యోగం గ్యారెంటీ!