తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఇంజినీరింగ్ అర్హతతో 1425 అప్రెంటీస్​ పోస్టులు - అప్లై చేసుకోండిలా! - engineering jobs 2024

SECL Apprentice Jobs 2024 : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. సౌత్​ ఈస్ట్రన్​ కోల్​ఫీల్డ్స్ లిమిటెడ్​ 1425 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

SECL Apprentice Recruitment 2024
SECL Apprentice Jobs 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 16, 2024, 10:25 AM IST

SECL Apprentice Jobs 2024 : మినీ రత్న హోదా కలిగిన ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ సౌత్ ఈస్ట్రన్​ కోల్​ఫీల్డ్స్​ లిమిటెడ్​ (SECL) 1425 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుల వివరాలు

  • మైనింగ్ ఇంజినీరింగ్ - 200 పోస్టులు
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 50 పోస్టులు
  • మెకానికల్ ఇంజినీరింగ్ - 50 పోస్టులు
  • సివిల్ ఇంజినీరింగ్​ - 30 పోస్టులు
  • ఎలక్ట్రానిక్స్​ అండ్ కమ్యునికేషన్ ఇంజినీరింగ్ - 30 పోస్టులు

టెక్నీషియన్ అప్రెంటీస్​ పోస్టుల వివరాలు

  • మైనింగ్ ఇంజినీరింగ్​/ మైనింగ్ అండ్ మైన్ సర్వేయింగ్​ - 900 పోస్టులు
  • మెకానికల్ ఇంజినీరింగ్ - 50 పోస్టులు
  • ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ - 75 పోస్టులు
  • సివిల్ ఇంజినీరింగ్ - 50 పోస్టులు
  • మొత్తం పోస్టులు : 1425

విద్యార్హతలు
SECL Apprentice Jobs Eligibility :

  • గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 4 ఏళ్ల ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి.
  • టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు అప్లై చేసే అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా 3 ఏళ్ల ఇంజినీరింగ్​ డిప్లొమా పూర్తి చేసి ఉండాలి.
  • ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమాలు పూర్తయ్యి 5 ఏళ్ల కంటే ఎక్కువ సమయం అయ్యుంటే, అలాంటి అభ్యర్థులు ఈ పోస్టులకు అప్లై చేయాల్సిన అవసరం లేదు.

వయోపరిమితి
SECL Apprentice Jobs Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 ఫిబ్రవరి 13 నాటికి 18 ఏళ్లు నిండి ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

ఎంపిక విధానం
SECL Apprentice Jobs Selection Process :ఇంజినీరింగ్ డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణత సాధించిన తేదీ ఆధారంగా, ముందుగా వీటిని పూర్తి చేసినవారికి ప్రాధాన్యత కల్పిస్తారు. ఒకవేళ ఈ విషయంలో టై ఏర్పడితే, ఇంజినీరింగ్ డిప్లొమాల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను షార్ట్ లిస్ట్ చేస్తారు. ఈ విషయంలోనూ టై అయితే, పుట్టిన తేదీ ఆధారంగా ముందుగా పుట్టినవారికి అవకాశం కల్పిస్తారు. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్​ను చూడండి.

దరఖాస్తు విధానం
SECL Apprentice Application Process :

  • అభ్యర్తులు ముందుగా https://nats.education.gov.in/ వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • ఈ వెబ్​సైట్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి, రిజిస్టర్ చేసుకోవాలి.
  • హోంపేజ్​లోని SECL రిక్రూట్​మెంట్​ లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని పత్రాలను అప్లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకొని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
SECL Apprentice Apply Last Date :

  • దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఫిబ్రవరి 27
  • డాక్యుమెంట్ వెరిఫికేషన్​ తేదీ (Tentatively) : 2024 మార్చి 15

SBIలో 131 'స్పెషలిస్ట్' ఉద్యోగాలు- అప్లై చేసుకోండిలా!

ఇంటర్​తో ఇండియన్​ కోస్ట్​గార్డులో ఉద్యోగాలు- వేలల్లో జీతం- లాస్ట్​డేట్​ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details