SBI Clerk Recruitment 2024 :బ్యాంక్ ఉద్యోగం చేయాలని కలలు కనేవారికి శుభవార్త. దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ - స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) నుంచి భారీ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ నోటిఫికేషన్ ద్వారా 13,735 క్లర్క్(జూనియర్ అసోసియేట్) ఖాళీలు భర్తీ కానున్నాయి. ఆసక్తి గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. అయితే, అందుకు సంబంధించిన అర్హతలు, వయోపరిమితి, దరఖాస్తు ఫీజు, అప్లికేషన్ ప్రాసెస్, చివరి తేదీ ఎప్పుడు? వంటి పూర్తి వివరాలు ఇప్పుడు చూద్దాం.
మొత్తం పోస్టుల సంఖ్య : జూనియర్ అసోసియేట్(కస్టమర్ సపోర్ట్), సేల్స్ విభాగాల్లో 13,735 ఉద్యోగాలు.
విద్యార్హతలు :అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్/ తత్సమాన ఉత్తీర్ణత కలిగి ఉండాలి. చివరి సెమిస్టర్ విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు.
వయో పరిమితి :అభ్యర్థుల వయసు ఏప్రిల్ 1, 2024 నాటికి తప్పనిసరిగా 20 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. అంటే.. ఏప్రిల్ 2, 1996 నుంచి ఏప్రిల్ 1, 2004(ఇన్‌క్లూజివ్) మధ్య జన్మించిన దరఖాస్తుదారులు అర్హులు. ఎస్సీ/ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు, ఓబీసీలకు 3 సంవత్సరాలు, పీడీబ్ల్యూడీ(జనరల్/ ఈడబ్ల్యూఎస్) అభ్యర్థులకు 10 సంవత్సరాలు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
అప్లికేషన్ ఫీజు :
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు రూ.750 ఫీజు చెల్లించాలి. SC, ST, దివ్యాంగులు ఎలాంటి అప్లికేషన్ ఫీజు లేదు.
అప్లికేషన్ ప్రాసెస్ :
- ఇందుకోసం ముందుగా ఎస్బీఐ అధికారిక వెబ్‌సైట్‌ని సందర్శించాలి.
- అనంతరం హెమ్ పేజీలో కనిపించే కెరీర్స్ అనే లింక్‌పై నొక్కాలి.
- దాంతో ఒక కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు అక్కడ కరెంట్ ఓపెనింగ్ లింక్‌పై Click చేయాలి.
- తర్వాత మళ్లీ ఇంకో న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. అప్పుడు ఆ పేజీలో అందుబాటులో ఉన్న SBI JUNIOR ASSOCIATE లింక్‌పై నొక్కాలి.
- అప్పుడు అప్లికేషన్ ఆన్‌లైన్ లింక్ వస్తుంది. ఆపై దానిపై క్లిక్ చేసి ముందుగా రిజిస్టర్ చేసుకోవాలి.
- అనంతరం అకౌంట్లోకి లాగిన్ అయి అప్లికేషన్ ఫామ్‌లో అవసరమైన వివరాలన్నింటిని నమోదు చేయాలి. ఆపై అడిగిన డాక్యుమెంట్స్‌ని అప్‌లోడ్ చేయాలి.
- చివరగా ఫామ్‌ని సబ్మిట్ చేసి అప్లికేషన్ ఫీజు చెల్లించాలి. అప్పుడు మీకు అప్లికేషన్ ఫామ్ వస్తుంది దాన్ని తదుపరి అవసరాల కోసం డౌన్లోడ్ చేసుకోవాలి. అంతే.. మీ అప్లికేషన్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది!
ఈ టిప్స్ ఫాలో అవ్వండి.. బ్యాంకు క్లర్క్ జాబ్ కొట్టేయండి
పరీక్ష, ఎంపిక విధానం :