Railway Jobs 2024 :సౌత్ ఈస్ట్ సెంట్రల్ రైల్వే ఒప్పంద ప్రాతిపదికన 733 అప్రెంటీస్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- కార్పెంటర్ - 38
- కోపా (COPA) - 100
- డ్రాఫ్ట్‌మెన్ (సివిల్) - 10
- ఎలక్ట్రీషియన్ - 137
- ఎలక్ట్రో మెకానిక్ - 5
- ఫిట్టర్ - 187
- మెషినిస్ట్ - 4
- పెయింటర్ - 42
- ప్లంబర్ - 25
- మెకానిక్ (RAC) - 15
- ఎస్ఎండబ్ల్యూ - 4
- స్టెనో (ఇంగ్లీష్) - 27
- స్టెనో (హిందీ) - 19
- డీజిల్ మెకానిక్ - 12
- టర్నర్ - 4
- వెల్డర్ - 18
- వైర్‌మెన్ - 80
- కెమికల్ లేబరేటరీ అసిస్టెంట్ - 4
- డిజిటల్ ఫొటోగ్రాఫర్ - 2
- మొత్తం పోస్టులు - 733
విద్యార్హతలు
SECR Apprentice Eligibility : అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగణంగా 10, 10+2తో పాటు, సంబంధిత ట్రేడ్ విభాగంలో ఐటీఐ చేసి ఉండాలి.
వయోపరిమితి
SECR Apprentice Age Limit :అభ్యర్థుల వయస్సు 15 ఏళ్ల నుంచి 24 ఏళ్ల మధ్యలో ఉండాలి.
దరఖాస్తు రుసుము
SECR Apprentice Fee :నోటిఫికేషన్లో దరఖాస్తు రుసుము గురించి ప్రస్తావించలేదు. కనుక అభ్యర్థులు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.