తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఇంజినీరింగ్ అర్హతతో NTPCలో 223 పోస్టులు - అప్లై చేసుకోండిలా! - latest job news 2024

NTPC Recruitment 2024 In Telugu : ఇంజినీరింగ్ చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్. ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ NTPC మొత్తం 223 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

NTPC Assistant Executive Posts
NTPC Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Jan 26, 2024, 10:20 AM IST

NTPC Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ నేషనల్ థర్మల్ పవర్​ కార్పొరేషన్​ (NTPC) 223 అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్​ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • యూఆర్​ - 98 పోస్టులు
  • ఈడబ్ల్యూఎస్​ - 22 పోస్టులు
  • ఓబీసీ - 40 పోస్టులు
  • ఎస్సీ - 39 పోస్టులు
  • ఎస్టీ - 24 పోస్టులు
  • మొత్తం పోస్టులు - 223

విద్యార్హతలు
NTPC Assistant Executive Qualifications :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి ఎలక్ట్రికల్​, మెకానికల్ విభాగాల్లో బీఈ, బీటెక్ చేసి ఉండాలి. అలాగే ఒక ఏడాది వర్క్ ఎక్స్​పీరియన్స్ కూడా ఉండాలి.

వయోపరిమితి
NTPC Assistant Executive Age Limit :అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 35 ఏళ్లు మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
NTPC Assistant Executive Fee :జనరల్​, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్​ఎం, మహిళా అభ్యర్థులకు దరఖాస్తు రుసుము నుంచి పూర్తి మినహాయింపు ఇచ్చారు.

ఎంపిక ప్రక్రియ
NTPC Assistant Executive Selection Process :అభ్యర్థులకు ముందుగా రాతపరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన వారికి ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఇందులోనూ క్వాలిఫై అయిన వారిని, వర్క్ ఎక్స్​పీరియన్స్​ను అనుసరించి, ఆయా పోస్టులకు ఎంపిక చేస్తారు.

టెన్యూర్​
NTPC Assistant Executive Job Tenure :అసిస్టెంట్​ ఎగ్జిక్యూటివ్​ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్లపాటు ఒప్పంద ప్రాతిపదికన పనిచేయాల్సి ఉంటుంది. అయితే అభ్యర్థుల పనితీరును అనుసరించి మరో 2 ఏళ్ల వరకు ఈ టెన్యూర్​ పెంచే అవకాశం ఉంటుంది.

జీతభత్యాలు
NTPC Assistant Executive Salary :అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.55,000 వరకు జీతం అందిస్తారు. దీనితోపాటు హెచ్​ఆర్​ఏ, మెడికల్ ఫెసిలిటీ లాంటి అదనపు బెనిఫిట్స్ కల్పిస్తారు. అంతేకాదు కంపెనీ వసతి సౌకర్యం కూడా లభిస్తుంది.

దరఖాస్తు విధానం
NTPC Assistant Executive Application Process :

  • అభ్యర్థులు ముందుగా https://www.ntpc.co.in/ వెబ్​సైట్ ఓపెన్​ చేయాలి.
  • Recruitment ట్యాబ్​పై క్లిక్ చేసి, ఓపెన్ చేయాలి.
  • ఎన్​టీపీసీ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్​ లింక్​పై క్లిక్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హత వివరాలు నమోదు చేసి, సబ్మిట్ చేయాలి.
  • వెంటనే ఓ 'యూనిక్ నంబర్' జనరేట్ అవుతుంది. దానిని జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి.
  • ఆన్​లైన్​లోనే అప్లికేషన్ ఫీజు చెల్లించాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
NTPC Assistant Executive Posts Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 జనవరి 25
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ : 2024 ఫిబ్రవరి 8

అసిస్టెంట్​ మేనేజర్​ ఉద్యోగాలు- లక్షా40వేలు జీతం!- పూర్తి వివరాలివే

భారత్​ డైనమిక్స్​లో 361 ఇంజినీరింగ్​ పోస్టులు - పరీక్ష లేకుండానే జాబ్స్!

ABOUT THE AUTHOR

...view details