NPCIL Executive Trainee Jobs 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్' (NPCIL) 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2024 ఏప్రిల్ 30 లోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టుల వివరాలు
- మెకానికల్ - 150 పోస్టులు
- కెమికల్ - 73 పోస్టులు
- ఎలక్ట్రికల్ - 69 పోస్టులు
- ఎలక్ట్రానిక్స్ - 29 పోస్టులు
- ఇన్స్ట్రుమెంటేషన్ - 19 పోస్టులు
- సివిల్ - 60 పోస్టులు
- మొత్తం పోస్టులు - 400
విద్యార్హతలు
NPCIL Executive Trainee Qualifications :అభ్యర్థులు ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, ఎలక్ట్రానిక్స్, ఇన్స్ట్రుమెంట్ మెకానికల్ విభాగాల్లో బీఈ/ బీటెక్/ బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే కచ్చితంగా 2022/2023/2024-గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
వయోపరిమితి
NPCIL Executive Trainee Age Limit :అభ్యర్థుల వయస్సు 21 ఏళ్ల నుంచి 26 ఏళ్ల మధ్యలో ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్ చూడండి.
దరఖాస్తు రుసుము
NPCIL Executive Trainee Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన పురుష అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.500 చెల్లించాలి. మిగతా కేటగిరీలకు చెందిన వారు అంటే మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్సీ, ఎస్టీలు ఎలాంటి దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.