NIACL Assistant Recruitment 2024 : ప్రముఖ ప్రభుత్వ రంగ బీమా సంస్థ న్యూ ఇండియా అస్యూరెన్స్ కో.లిమిటెడ్ 300 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. దరఖాస్తులు ఫిబ్రవరి 1 నుంచి స్వీకరించనున్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
విద్యార్హతలు
NIACL Assistant Qualifications :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం లేదా విద్యాసంస్థ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. అలాగే వారికి తమ రాష్ట్ర/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన స్థానిక భాషలు కచ్చితంగా తెలిసి ఉండాలి.
వయోపరిమితి
NIACL Assistant Age Limit :అభ్యర్థుల వయస్సు కనిష్ఠంగా 21 ఏళ్ల నుంచి గరిష్ఠంగా 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
అప్లికేషన్ ఫీజు
NIACL Assistant Fee :జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.850 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు అప్లికేషన్ ఫీజుగా రూ.100 చెల్లిస్తే సరిపోతుంది.
ఎంపిక ప్రక్రియ
NIACL Assistant Selection Process :అభ్యర్థులకు ప్రిలిమినరీ, మెయిన్స్ ఎగ్జామ్స్ నిర్వహిస్తారు. వీటిలో ఉత్తీర్ణులైన వారికి రీజినల్ లాంగ్వేజ్ టెస్ట్ పెడతారు. దీనిలో కూడా క్వాలిఫై అయిన అభ్యర్థులను అసిస్టెంట్ పోస్టులకు ఎంపిక చేస్తారు.