NIA Jobs 2024 : నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) పోస్టుల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆఫ్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- అసిస్టెంట్ - 7 పోస్టులు
- స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ 1) - 24 పోస్టులు
- అప్పర్ డివిజన్ క్లర్క్ - 9 పోస్టులు
- మొత్తం పోస్టులు - 40
విద్యార్హతలు
NIA Job Education Qualification :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయాలు లేదా విద్యా సంస్థల్లో చదివి, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే కంప్యూటర్ ప్రొఫీషియెన్సీ టెస్ట్‌లో పాస్ అయ్యుండాలి. పూర్తి వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ను చూడండి.
వయోపరిమితి
NIA Job Age Limit :అభ్యర్థుల వయస్సు గరిష్ఠంగా 56 ఏళ్లు మించి ఉండకూడదు.
జీతభత్యాలు
NIA Job Salary :
- అసిస్టెంట్ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు జీతం ఇస్తారు.
- స్టెనోగ్రాఫర్ (గ్రేడ్ 1) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.35,400 నుంచి రూ.1,12,400 వరకు సాలరీ ఇస్తారు.
- అప్పర్ డివిజన్ క్లర్క్ (యూడీసీ) పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.25,500 నుంచి రూ.81,100 వరకు జీతం అందిస్తారు.
డిప్యుటేషన్ పీరియడ్
అసిస్టెంట్, స్టెనోగ్రాఫర్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు 3 ఏళ్లపాటు డిప్టుటేషన్ బేసిస్‌పై పనిచేయాల్సి ఉంటుంది.