NHPC Engineer Jobs 2024 :ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ 'నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్' (NHPC) 280 ట్రైనీ ఇంజినీర్, ట్రైనీ ఆఫీసర్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఉద్యోగాల వివరాలు
- ట్రైనీ ఇంజినీర్ (సివిల్) : 95 పోస్టులు
- ట్రైనీ ఇంజినీర్ (ఎలక్ట్రికల్) : 75 పోస్టులు
- ట్రైనీ ఇంజినీర్ (మెకానికల్) : 77 పోస్టులు
- ట్రైనీ ఇంజినీర్ (E&C) : 04 పోస్టులు
- ట్రైనీ ఇంజినీర్ & ట్రైనీ ఆఫీసర్ (ఐటీ) : 20 పోస్టులు
- ట్రైనీ ఇంజినీర్ & ట్రైనీ ఆఫీసర్ (ఎన్విరాన్మెంట్) : 06 పోస్టులు
- ట్రైనీ ఆఫీసర్ (జియోలజీ) : 03 పోస్టులు
- మొత్తం పోస్టులు : 280
విద్యార్హతలు
NHPC Engineer Job Qualification :అభ్యర్థులు ఆయా పోస్టులను బట్టి బీఎస్ఈ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎంసీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే గేట్-2023 స్కోర్ కచ్చితంగా ఉండి తీరాలి.
వయోపరిమితి
NHPC Engineer Job Age Limit :అభ్యర్థుల గరిష్ఠ వయస్సు 30 ఏళ్లలోపు ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
NHPC Engineer Job Application Fee :జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.600+ టాక్స్లు కలిపి రూ.708 చెల్లించాలి. మహిళలు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, ఎస్టీ, ఎస్సీ కేటగిరీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.