తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఇంటర్​, డిగ్రీ అర్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు- దరఖాస్తు చేసుకోండిలా! - nalco job openings

Nalco Recruitment 2024 In Telugu : ప్రభుత్వ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్​(ఎన్​ఏఎల్​సీఒ) వివిధ పోస్టుల భర్తీకోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు తదితర వివరాలు మీ కోసం.

Nalco Recruitment 2024 In Telugu
Nalco Recruitment 2024 In Telugu

By ETV Bharat Telugu Team

Published : Feb 3, 2024, 10:48 AM IST

Updated : Feb 3, 2024, 11:05 AM IST

Nalco Recruitment 2024 In Telugu : ప్రభుత్వ రంగ సంస్థ అయిన నేషనల్​ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్​( ఎన్​ఏఎల్​సీఒ) జూనియర్​ ఫోర్​మెన్​, ల్యాబొరేటరీ అసిస్టెంట్​, డ్రస్సెర్​ కమ్​ ఫస్ట్​ ఎయిడర్​, నర్స్​ సహా ఇతర పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు ఒడిశాలోని అంగుల్​లోని నాల్కోలో పనిచేయాల్సి ఉంటుంది. పోస్టుల వివరాలు, అర్హత, ఫీజు, చివరి తేదీ తదితర వివరాలు మీ కోసం.

పోస్టుల వివరాలు
మొత్తం పోస్టుల సంఖ్య : 42

  1. జూనియర్​ ఫోర్​మెన్( షార్ట్​ ఫైర్​ బ్లాస్టర్​)-2 పోస్టులు
  2. జూనియర్​ ఫోర్​మెన్(ఓవెర్​మెన్)-18 పోస్టులు
  3. జూనియర్​ ఫోర్​మెన్ (ఎలక్ట్రికల్​)- 05 పోస్టులు
  4. జూనియర్​ ఫోర్​మెన్- సర్వేయర్​- 0​5 పోస్టులు
  5. ల్యాబొరేటరీ అసిస్టెంట్ గ్రేడ్​-3-02 పోస్టులు
  6. డ్రస్సెర్​-కమ్​-ఫస్ట్​ ఎయిడర్ -4 పోస్టులు
  7. నర్స్​ గ్రేడ్​3-4 పోస్టులు

అర్హత : పోస్టులను అనుసరించి ఇంటర్​, హెచ్​ఎస్సీ, డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ, నర్సింగ్, డిప్లొమో(సివిల్​ ఇంజినీరింగ్, మైనంగ్​ ఇంజినీరింగ్, ఎలక్ట్రికల్​ ఇంజినీరింగ్, ఉత్తీర్ణతతో పాటు సంబంధిత విభాగంలో రెండేళ్ల పాటు అనుభవం ఉండాలి.

  • వయో పరిమితి :35-40 ఏళ్లు మించరాదు
  • అప్లికేషన్ ఫీజు :EWS, OBC అభ్యర్థులకు రూ.100, ఎస్సీ, ఎస్టీ అభర్థులకు ఫీజు లేదు
  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ :30-01-2024
  • అప్లికేషన్ల స్వీకరణను చివరి తేదీ : 18-02-2024
  • దరఖాస్తు విధానం :ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఎన్​ఏఎల్​సీఒ అఫీషియల్​ వెబ్​సైట్​ను సందర్శించి ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఎంపిక ప్రక్రియ : అర్హులైన అభ్యర్థులకు ముందుగా రాత పరీక్ష నిర్వహిస్తారు. అనంతరం ట్రేడ్​ టెస్ట్ ఉంటుంది.
  • రాత పరీక్షకు 60% శాతం మార్కుల వెయిటేజీ ఉంటుంది. ట్రేడ్​ టెస్ట్​కు 40% వెయిటేజీ​ ఉంటుంది.

రైల్వేలో 9000 ఉద్యోగాలు
RRB Technician Recruitment 2024 : రైల్వే ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి గుడ్​న్యూస్​. త్వరలో టెక్నికల్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పట్నా రైల్వే రిక్రూట్​మెంట్ బోర్డు ఇటీవలే వెల్లడించింది. సుమారు 9,000 టెక్నీషియన్ పోస్టులు ఉన్నట్లు ఆర్​ఆర్​బీ పట్నా పేర్కొంది. ఈ మేరకు నియామక షెడ్యూల్​ను తాజాగా విడుదల చేసింది. పూర్తి వార్తను చదివేందుకు ఈ లింక్​పై క్లిక్చేయండి.

ప్రభుత్వ రంగ బీమా సంస్థ NIACLలో 300 అసిస్టెంట్​ పోస్టులు - దరఖాస్తు చేయండిలా!

దక్షిణ రైల్వేలో 2860 అప్రెంటీస్ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

Last Updated : Feb 3, 2024, 11:05 AM IST

ABOUT THE AUTHOR

...view details