Mock Interview Websites :మీరు సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా కెరీర్ ప్రారంభిద్దామని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. చాలా మంది ఇంటర్వ్యూ పేరు చెప్పగానే చాలా నెర్వస్‌గా ఫీల్ అవుతూ ఉంటారు. ఇలాంటి వారు తమకు అన్ని రకాల క్వాలిఫికేషన్స్, స్కిల్స్ ఉన్నప్పటికీ ఇంటర్వ్యూలో తడబడి మంచి ఉద్యోగ అవకాశాన్ని పోగొట్టుకుంటూ ఉంటారు. అందుకే ఇలాంటి వారు మాక్ ఇంటర్వ్యూలకు వెళ్లడం చాలా మంచిది. అయితే కొంత మందికి డబ్బులు కట్టి, మాక్ ఇంటర్వ్యూలకు వెళ్లడం కష్టంగా ఉంటుంది. ఇలాంటి వాళ్లు చింతించాల్సిన పనేమీ లేదు. నేడు ఆన్లైన్లో చాలా మాక్ ఇంటర్వ్యూ వెబ్సైట్లు అందుబాటులో ఉన్నాయి. వాటి ద్వారా మీరు ప్రాక్టీస్ చేయవచ్చు. అందుకే ఈ ఆర్టికల్‌లో గూగుల్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న దీక్షా పాండే సూచించిన కొన్ని ముఖ్యమైన 'ఫ్రీ మాక్ ఇంటర్వ్యూ వెబ్‌సైట్స్' గురించి తెలుసుకుందాం.
PRAMP.COM :
సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఈ PRAMP.COM అనే ఫ్రీ మాక్ ఇంటర్వ్యూ ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగించుకోవచ్చు. దీనిని ఉపయోగించి టెక్నికల్ రౌండ్ ఇంటర్వ్యూను ప్రాక్టీస్ చేయవచ్చు. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ప్రిఫరెన్స్, ప్రాక్టీస్ అవసరాల మేరకు దీనిని ఉపయోగించుకోవచ్చు. ఈ వెబ్సైట్లో కోడ్ ఎడిటర్ ద్వారా లైవ్‌లో వన్-టు-వన్ ఇంటర్వ్యూ సెషన్లు నిర్వహిస్తారు.
INTERVIEWING.IO :
సాఫ్ట్వేర్ ఇంజినీర్లకు INTERVIEWING.IO ప్లాట్‌ఫామ్ బాగా ఉపయోగపడుతుంది. ఈ సైట్లో నిజమైన వ్యక్తులతో ఫ్రీ మాక్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. అలాగే ఈ వెబ్సైట్లో మీతోటి వ్యక్తులతో కలిసి ప్రాక్టీస్ సెషన్లు పెట్టుకోవచ్చు. అంతేకాదు ఈ వెబ్సైట్లో పెయిడ్ మెంబర్‌గా కూడా చేరవచ్చు. దీని వల్ల గూగుల్, ఫేస్బుక్ లాంటి పెద్దపెద్ద సంస్థల్లో సీనియర్ ఇంజినీర్లుగా ఉన్నవారు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు. వాళ్లు మీకు ఇంటర్వ్యూలను ఎలా ఎదుర్కోవాలో చెబుతారు. మీరు ఇంటర్వ్యూను ఎలా ఎదుర్కొన్నారు? ఏమేమి ఇంప్రూవ్ చేసుకోవాలి? అనే సూచనలు కూడా ఇస్తారు. కనుక చక్కగా ప్రాక్టీస్ చేస్తే, మంచి జాబ్ సాధించే అవకాశం పెరుగుతుంది.