తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా అర్హతతో - ఇండియన్​ నేవీలో 741 పోస్టులు - దరఖాస్తుకు మరో 7 రోజులే ఛాన్స్​! - Indian Navy Recruitment 2024

Indian Navy Recruitment 2024 : ఐటీఐ, డిగ్రీ, డిప్లొమాలు చేసి ప్రభుత్వ రంగ ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు గుడ్ న్యూస్​. భారత నౌకాదళం 741 పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో గ్రూప్​-బి, గ్రూప్​-సి పోస్టులు ఉన్నాయి. పూర్తి వివరాలు మీ కోసం.

Indian Navy INCET Recruitment 2024 Civilian Notification
Indian Navy (ANI)

By ETV Bharat Telugu Team

Published : Jul 26, 2024, 10:42 AM IST

Indian Navy Recruitment 2024 : ఇండియన్ నేవీలో పనిచేయాలని ఆశిస్తున్న అభ్యర్థులకు గుడ్​ న్యూస్​. భారత నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీ కోసం ప్రకటన విడుదల చేసింది. ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివిన వారు ఈ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టు (INCET-01/2024)తో ఈ ఉద్యోగాలు భర్తీ చేస్తారు. గ్రూప్‌-బి, గ్రూప్‌-సి విభాగాల్లో ఈ పోస్టులు ఉన్నాయి.

ఈ నేవీ రిక్రూట్​మెంట్​లో సెలెక్ట్​ అయినవారు ఛార్జ్‌మ్యాన్, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ట్రేడ్స్‌మ్యాన్ మేట్‌, ఫైర్‌మ్యాన్ హోదాతో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. ఇవన్నీ సాంకేతిక సేవలకు చెందిన ఉద్యోగాలే కావడం గమనార్హం. అభ్యర్థులకు రాత పరీక్ష, వైద్య పరీక్షలు చేసి, అర్హులను ఉద్యోగంలోకి తీసుకుంటారు. దేశంలో ఉన్న నేవీ కేంద్రాల్లో వీరు తమ విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

పరీక్ష పేరు : ఇండియన్ నేవీ సివిలియన్ ఎంట్రన్స్ టెస్ట్ (ఐఎన్‌సెట్‌-01/2024)

ఉద్యోగాల వివరాలు

1. ఇండియన్ నేవీ ఈ రిక్రూట్​మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-‘బి (ఎన్‌జీ)’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్, నాన్ మినిస్టీరియల్ పోస్టులను భర్తీ చేయనుంది.

  • ఛార్జ్‌మ్యాన్ (అమ్యూనిషన్‌ వర్క్‌షాప్) - 01 పోస్టులు
  • ఛార్జ్‌మ్యాన్ (ఫ్యాక్టరీ) - 10 పోస్టులు
  • ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్) - 18 పోస్టులు
  • సైంటిఫిక్ అసిస్టెంట్ - 04 పోస్టులు

2. ఇండియన్ నేవీ ఈ రిక్రూట్​మెంట్ ద్వారా జనరల్ సెంట్రల్ సర్వీస్, గ్రూప్-‘సి’, నాన్ గెజిటెడ్, ఇండస్ట్రియల్ పోస్టులను కూడా భర్తీ చేయనుంది.

  • డ్రాఫ్ట్స్‌మ్యాన్ (కన్‌స్ట్రక్షన్‌) - 02 పోస్టులు
  • ఫైర్‌మ్యాన్ - 444 పోస్టులు
  • ఫైర్ ఇంజిన్ డ్రైవర్ - 58 పోస్టులు
  • ట్రేడ్స్‌మ్యాన్ మేట్ - 161 పోస్టులు
  • పెస్ట్ కంట్రోల్ వర్కర్ - 18 పోస్టులు
  • కుక్ - 09 పోస్టులు
  • ఎంటీఎస్‌ (మినిస్టీరియల్) - 16 పోస్టులు
  • మొత్తం పోస్టుల సంఖ్య : 741

విద్యార్హతలు
పోస్టును అనుసరించి అభ్యర్థులు 10వ తరగతి, 12వ తరగతి సహా, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయోపరిమితి

  • సైంటిఫిక్ అసిస్టెంట్, ఛార్జ్‌మ్యాన్ (మెకానిక్) పోస్టులకు అభ్యర్థుల వయస్సు 30 ఏళ్లకు మించకూడదు.
  • ఫైర్‌మ్యాన్, ఫైర్ ఇంజిన్ డ్రైవర్ పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లలోపు ఉండాలి.
  • మిగిలిన అన్ని పోస్టులకు అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లలోపు ఉండాలి.
  • ఓబీసీలకు 3 ఏళ్లు; దివ్యాంగులకు 10 ఏళ్లు; ఎస్టీ, ఎస్సీలకు 5 ఏళ్లు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము

  • జనరల్​, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.295 చెల్లించాలి.
  • మహిళలు, దివ్యాంగులు, ఎస్టీ, ఎస్సీలు అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 ఆగస్టు 02

ముఖ్యాంశాలు

  • భారత నౌకాదళం 741 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్‌ విడుదల చేసింది.
  • ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఇండియన్‌ నేవీ సివిలియన్‌ ఎంట్రన్స్‌ టెస్టుతో ఈ పోస్టులను భర్తీ చేస్తారు.
  • అర్హత, ఆసక్తి ఉన్నవారు 2024 ఆగస్టు 2వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

ట్యాక్సీ/క్యాబ్ బిజినెస్ చేస్తారా? టాప్-10 కమర్షియల్ కార్స్ ఇవే! - Best Commercial Car In 2024

భవిష్యత్​ కోసం మనీ సేవ్ చేయాలా? ఈ 5 టిప్స్ మీ కోసమే! - Money Saving Tips

ABOUT THE AUTHOR

...view details