తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఇంటర్​ అర్హతతో ఇండియన్ కోస్ట్​ గార్డ్​లో 260 ఉద్యోగాలు - అప్లై చేసుకోండిలా! - central govt jobs 2024

ICG Navik GD Recruitment 2024 : భారత రక్షణ దళాల్లో పనిచేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్ న్యూస్​. ఇండియన్ కోస్ట్​ గార్డ్​ (ICG) 260 నావిక్​ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. విద్యార్హతలు, వయోపరిమితి, ఫీజు, దరఖాస్తు విధానం తదితర పూర్తి వివరాలు మీ కోసం.

Indian coast guard jobs 2024
ICG Navik GD Recruitment 2024

By ETV Bharat Telugu Team

Published : Feb 17, 2024, 10:16 AM IST

ICG Navik GD Recruitment 2024 :ఇండియన్ కోస్ట్​ గార్డ్​ (ICG) 260 నావిక్ (జనరల్ డ్యూటీ) పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఎంపికైన అభ్యర్థులు సముద్ర జలాల పరిరక్షణ చేయాలి. అలాగే నావికాదళంతో సమన్వయం చేసుకుంటూ, రెస్క్యూ ఆపరేషన్లు కూడా నిర్వహించాలి. ఆసక్తిగల అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో అప్లై చేసుకోవాలి.

విద్యార్హతలు
ICG Navik Eligibility :అభ్యర్థులు ప్రభుత్వ గుర్తింపు పొందిన విద్యాలయం నుంచి మ్యాథ్స్​, ఫిజిక్స్​ ప్రధానాంశాలుగా ఇంటర్​ (10+2) ఉత్తీర్ణత సాధించి ఉండాలి.

వయోపరిమితి
ICG Navik Age Limit :అభ్యర్థుల వయస్సు 18-22 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఇంకా కచ్చితంగా చెప్పాలంటే, 2002 సెప్టెంబర్​ 1 నుంచి 2006 ఆగస్టు 31 మధ్యలో జన్మించి ఉండాలి. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఆయా కేటగిరీల వారికి వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.

దరఖాస్తు రుసుము
ICG Navik Application Fee :అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 ఆన్​లైన్​లో చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన పనిలేదు.

ఎంపిక విధానం
ICG Navik Selection Process :అభ్యర్థులకు ముందుగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణులైన అభ్యర్థులకు అసెస్మెంట్​ టెస్ట్/ అడాప్టబిలిటీ టెస్ట్​, ఫిజికల్ ఫిట్​నెస్​ టెస్ట్​, డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఎగ్జామినేషన్ చేస్తారు. వీటన్నింటిలోనూ క్వాలిఫై అయిన అభ్యర్థులను నావిక్ (జీడీ) పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం
ICG Navik Application Process :

  • అభ్యర్థులు ముందుగా ఐసీజీ అధికారిక వెబ్​సైట్​ https://joinindiancoastguard.cdac.in/cgept/ ఓపెన్ చేయాలి.
  • Apply Online లింక్​పై క్లిక్ చేయాలి.
  • అప్లికేషన్ ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు అప్లోడ్​ చేయాలి.
  • అప్లికేషన్ ఫీజు ఆన్​లైన్​లోనే చెల్లించాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్​ చేసుకుని అప్లికేషన్​ సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు
ICG Navik Apply Last Date :

  • దరఖాస్తు స్వీకరణ ప్రారంభ తేదీ : 2024 ఫిబ్రవరి 13
  • దరఖాస్తుకు ఆఖరు తేదీ :2024 ఫిబ్రవరి 27

ఇంజినీరింగ్ అర్హతతో 1425 అప్రెంటీస్​ పోస్టులు - అప్లై చేసుకోండిలా!

ఇంటర్​తో ఇండియన్​ కోస్ట్​గార్డులో ఉద్యోగాలు- వేలల్లో జీతం- లాస్ట్​డేట్​ ఎప్పుడంటే?

ABOUT THE AUTHOR

...view details