తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

IBPS భారీ నోటిఫికేషన్ - 4455 పీవో/ మేనేజ్​మెంట్ ట్రైనీ పోస్టులు భర్తీ! - IBPS PO Recruitment 2024 - IBPS PO RECRUITMENT 2024

IBPS PO Recruitment 2024 : ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,455 పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఆగస్టు 21లోగా అప్లై చేయొచ్చు. 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులు. పూర్తి వివరాలు మీ కోసం.

IBPS PO Recruitment 2024
IBPS PO Recruitment 2024 (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Aug 3, 2024, 11:10 AM IST

IBPS PO Recruitment 2024 : బ్యాంకు జాబ్స్‌‌కు అప్లై చేయాలని ఎదురుచూస్తున్న వారికి గుడ్ న్యూస్. ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ప్రొబేషనరీ ఆఫీసర్లు(పీవో), మేనేజ్‌మెంట్ ట్రెయినీ పోస్టుల భర్తీకి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బ్యాంకింగ్‌ పర్సనల్‌ సెలెక్షన్‌ (ఐబీపీఎస్‌) నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీని ద్వారా 4,455 పోస్టులను భర్తీ చేయనున్నారు. వీటిలో ఎస్సీ కేటగిరీ వారికి 657 పోస్టులు, ఎస్టీ - 332, ఓబీసీ - 1185, ఈడబ్ల్యూఎస్‌ - 435, యూఆర్‌ కేటగిరీ వారికి 1846 పోస్టులు కేటాయించారు. ఏదైనా డిగ్రీ పాసైనవారు ఈ జాబ్స్‌కు ఆగస్టు 21లోగా ఆన్‌లైన్‌లో అప్లై చేయొచ్చు. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు రూ.175, ఇతరులు రూ.850 మేర అప్లికేషన్ ఫీజును చెల్లించాలి. 2024 ఆగస్టు 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లలోపు వయసు కలిగిన వారు అర్హులు. అభ్యర్థులకు ఈ ఏడాది సెప్టెంబరులో ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్ ఇస్తారు.

ఏయే బ్యాంకుల్లో ఎన్ని ఖాళీలు
బ్యాంకుల వారీగా ఖాళీలను పరిశీలిస్తే, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 2000 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 885 పోస్టులు, కెనరా బ్యాంక్‌లో 750 పోస్టులు ఉన్నాయి. ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లో 260 పోస్టులు, పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 200 పోస్టులు, పంజాబ్ అండ్‌ సింధ్ బ్యాంక్‌లో 360 పోస్టులు ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలలో కూడా పోస్టులు ఉన్నాయి.

ప్రిలిమ్స్ పరీక్ష
ఈ జాబ్స్ భర్తీలో భాగంగా తొలుత ప్రిలిమ్స్ రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టెస్ట్)ను నిర్వహిస్తారు. పరీక్ష ఇంగ్లీష్, హిందీ మీడియంలలో జరుగుతుంది. 60 నిమిషాలలో మొత్తం 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు ఒక్కో మార్కును కేటాయిస్తారు. ప్రిలిమ్స్‌లో ఇంగ్లీష్ లాంగ్వేజ్ - 30 ప్రశ్నలు, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ - 35 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ - 35 ప్రశ్నలు ఉంటాయి. ప్రిలిమిన‌రీ ప‌రీక్ష కాల్‌ లెట‌ర్లను అక్టోబరులో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. ఈ ప‌రీక్ష అక్టోబర్‌లోనే ఆన్‌లైన్ పద్ధతిలో జరుగుతుంది. దీని ఫ‌లితాలు అక్టోబర్ నెలాఖరు లేదా నవంబర్‌లో విడుదలవుతాయి.

మెయిన్స్ పరీక్ష
మెయిన్స్ పరీక్షలో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రకాల ప్రశ్నలను అడుగుతారు. పరీక్ష ఇంగ్లీష్, హిందీ మీడియంలలో జరుగుతుంది. మొత్తం 155 ప్రశ్నలకు 200 మార్కులు ఉంటాయి. పరీక్షా సమయం 3 గంటలు. ప్రశ్నల విషయానికొస్తే, రీజనింగ్ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్‌కు సంబంధించిన 45 ప్రశ్నలకు 60 మార్కులు, జనరల్/ ఎకానమీ/ బ్యాంకింగ్ అవేర్‌నెస్ (40 ప్రశ్నలు- 40 మార్కులు), ఇంగ్లీష్ లాంగ్వేజ్ (35 ప్రశ్నలు- 40 మార్కులు), డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్‌ప్రెటేషన్‌కు సంబంధించిన 35 ప్రశ్నలకు 60 మార్కులు కేటాయిస్తారు. మెయిన్స్ ఎగ్జామ్ కాల్‌లెట‌ర్లను నవంబరులో డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. అదే నెలలో ఎగ్జామ్ ఉంటుంది. రిజల్ట్స్ డిసెంబర్ లేదా జనవరిలో రిలీజ్ అవుతాయి.

ఇంగ్లీష్ లాంగ్వేజ్ పరీక్ష
ఇక ఇంగ్లీష్ లాంగ్వేజ్ (లెటర్ రైటింగ్ & ఎస్సే) పరీక్షలో 2 ప్రశ్నలకు 25 మార్కులను కేటాయిస్తారు. ఈ పరీక్షను ఇంగ్లీష్ మీడియంలో నిర్వహిస్తారు. ఈ పరీక్ష సమయం 30 నిమిషాలు. మెయిన్స్ పరీక్ష ముగిశాక, ఇంట‌ర్వ్యూలు జనవరి/ ఫిబ్రవరిలో జరుగుతాయి. అభ్యర్థుల తుది నియామకాలు వచ్చే ఏడాది ఏప్రిల్‌లో ఉంటాయి.

తెలుగు రాష్ట్రాల్లో ప్రిలిమ్స్ పరీక్ష కేంద్రాలివీ
హైదరాబాద్/ సికింద్రాబాద్, గుంటూరు/ విజయవాడ, వరంగల్, అనంతపురం, ఏలూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విశాఖపట్నం, విజయనగరం, కరీంనగర్, ఖమ్మం, మహబూబ్‌నగర్.

తెలుగు రాష్ట్రాల్లో మెయిన్స్ పరీక్ష కేంద్రాలివీ
గుంటూరు/ విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, హైదరాబాద్/ సికింద్రాబాద్, కరీంనగర్.

ఉద్యోగాన్వేషణలో తోడుగా - సరికొత్త AI టూల్స్‌ - ఎలా వాడాలంటే? - LinkedIn AI Tools

నిరుద్యోగులకు గుడ్ న్యూస్ - రైల్వేలో 7951 జేఈ, సూపర్​ వైజర్​ పోస్టులు భర్తీ - దరఖాస్తు చేసుకోండిలా! - RRB JE Recruitment 2024

ABOUT THE AUTHOR

...view details