High Paying Creative Jobs 2024 :ఒకప్పుడు ఎక్కువ మంది సంప్రదాయ ఉద్యోగాలు చేయడానికి ఇష్టపడేవారు. కానీ నేడు పరిస్థితులు మారాయి. క్రియేటివ్ జాబ్స్ చేయడానికి యువత ఆసక్తి చూపిస్తున్నారు. తమలోని క్రియేటివిటీని ప్రపంచానికి తెలియజేయాలని ఆశిస్తున్నారు. అందుకే ఈ ఆర్టికల్‌లో ప్రస్తుతం బాగా డిమాండ్, హై పేమెంట్స్ ఉన్న క్రియేటివ్ కెరీర్స్‌పై ఓ లుక్కేద్దాం.
క్రియేటివ్ మైండ్స్
టెక్నాలజీ పెరుగుతున్న కొలదీ క్రియేటివ్ ఫీల్డ్‌లో అవకాశాలు బాగా పెరుగుతున్నాయి. గేమింగ్, ఫిల్మింగ్, స్టోరీ రైటింగ్, మార్కెటింగ్, అడ్వర్టైజింగ్, డిజైనింగ్, కంటెంట్ క్రియేటింగ్ లాంటి క్రియేటివ్ జాబ్స్‌కు విపరీతంగా డిమాండ్ పెరుగుతోంది. పైగా వీటికి భారీ ఎత్తున పేమెంట్స్ కూడా ఇస్తున్నారు. అందువల్ల మీకు నచ్చిన పనిచేస్తూనే, ఆర్థికంగా బాగా స్థిరపడేందుకు ఇవి సహకరిస్తున్నాయి. అందుకే ఈ ఆర్టికల్‌లో టాప్-5 క్రియేటివ్ కెరీర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.
1. మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ : ఈ ఫీల్డ్‌లో క్రియేటివ్ డైరెక్టర్స్, బ్రాండ్ మేనేజర్స్, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్‌లకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈ మార్కెటింగ్ అండ్ అడ్వర్టైజింగ్ ఫీల్డ్‌లో యావరేజ్‌గా నెలకు రూ.60,000 వరకు సాలరీ లభిస్తుంది. సోషల్ మీడియా మేనేజర్, ఎస్ఈఓ స్పెషలిస్ట్‌లు అయితే సంవత్సరానికి రూ.5 లక్షల నుంచి రూ.18 లక్షలు వరకు సంపాదిస్తుంటారు.
2. ఫిల్మ్ అండ్ మీడియా :స్క్రిప్ట్ రైటింగ్, ఫిల్మ్ డైరెక్షన్, ప్రొడక్షన్ డిజైనింగ్, యాక్టింగ్, ఎడిటింగ్ చేసేవారికి నేడు మంచి డిమాండ్ ఉంది. అయితే ఈ ఫీల్డ్‌లో మంచి సక్సెస్ సాధించిన వారికి బాగా డబ్బులు వస్తాయి. లేదంటే ఆర్థికంగా కాస్త ఇబ్బందిగానే ఉంటుంది.
ఉదాహరణకు విక్రాంత్ మెస్సే అనే నటుడు నెలకు సుమారుగా రూ.35 లక్షలు వరకు సంపాదిస్తుంటారు. కానీ బాలీవుడ్ హీరో సల్మాన్‌ఖాన్ ఒక్కో మూవీకి సుమారుగా రూ.100 కోట్లు వరకు తీసుకుంటాడు. ప్లాప్ హీరోలకు కనీసం ఛాన్స్‌లు కూడా రాకపోవచ్చు. ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి.
3. ఆర్కిటెక్చర్ అండ్ ఇంటీరియర్ డిజైనింగ్ : ఆర్కిటెక్చురల్ ఇంజినీరింగ్, డ్రాఫ్ట్స్‌మెన్, ఇంటీరియర్ డిజైనర్, కాంట్రాక్టర్స్ ఈ ఫీల్డ్‌లో ఉంటారు. వీరికి స్టార్టింగ్ సాలరీ సంవత్సరానికి రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఉంటుంది. కానీ మంచి పనితనం, బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవారికి భారీ ఎత్తున పేమెంట్స్ ఉంటాయి.