తెలంగాణ

telangana

ETV Bharat / education-and-career

ఐటీఐ అర్హతతో - కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో 307 పోస్టులు - దరఖాస్తు చేసుకోండిలా!

సీఎస్​ఎల్​లో అప్రెంటీస్​షిప్​ కోసం నోటిఫికేషన్ విడుదల - ఎంపిక పక్రియ ఎలా ఉంటుందంటే?

By ETV Bharat Telugu Team

Published : 4 hours ago

Cochin Shipyard Limited
Cochin Shipyard Limited (ANI)

CSL Apprentice Recruitment 2024 : కేరళలోని కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (CSL) 307 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు గడువులోగా ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

పోస్టుల వివరాలు

  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్ - 299
  • టెక్నీషియన్ అప్రెంటిస్ - 8
  • మొత్తం పోస్టుల సంఖ్య - 307

ట్రేడ్​ విభాగాలు :ఫిట్టర్​, వెల్డర్​, ఎలక్ట్రీషియన్​, మెషినిస్ట్​,ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇనుస్ట్రుమెంట్ మెకానిక్, డ్రాఫ్ట్స్‌మ్యాన్ (మెకానికల్/ సివిల్‌), పెయింటర్ (జనరల్/ మెరైన్), అకౌంటింగ్, కస్టమర్ రిలేషన్‌షిప్ మేనేజ్‌మెంట్, ఫుడ్ అండ్ క్రాఫ్ట్ బేకర్​.

విద్యార్హతలు :

  • అభ్యర్థులు పదో తరగతితోపాటు, సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి.
  • అలాగే ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ (వీహెచ్ఎస్ఈ) ఉత్తీర్ఱత కలిగి ఉండాలి.

వయోపరిమితి :అభ్యర్థుల వయస్సు 2024 అక్టోబర్​ 23 నాటికి కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.
స్టైపెండ్ :

  • ఐటీఐ ట్రేడ్ అప్రెంటిస్‌లకు నెలకు రూ.8,000 స్టైపెండ్ ఇస్తారు.
  • టెక్నీషియన్ అప్రెంటిస్‌కు ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.9,000 స్టైపెండ్ అందిస్తారు.

ఎంపిక ప్రక్రియ : విద్యార్హతల్లో సాధించిన మార్కులు ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్​, మెడికల్ ఫిట్​నెస్ ఆధారంగా అర్హులైన అభ్యర్థులను ట్రేడ్ అప్రెంటీస్​, టెక్నీషియన్ అప్రెంటీస్ పోస్టులకు ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం

  • అభ్యర్థులు ముందుగా కొచ్చిన్ షిప్​యార్డ్​ లిమిటెడ్​కు చెందిన అధికారిక వెబ్​సైట్ ఓపెన్ చేయాలి.
  • దరఖాస్తు ఫారమ్​లో మీ వ్యక్తిగత, విద్యార్హతల వివరాలు నమోదు చేయాలి.
  • అవసరమైన అన్ని డాక్యుమెంట్లు, గుర్తింపు పత్రాలు అప్లోడ్ చేయాలి.
  • అన్ని వివరాలు మరోసారి చెక్ చేసుకుని, అప్లికేషన్​ను సబ్మిట్ చేయాలి.
  • భవిష్యత్ రిఫరెన్స్ కోసం అప్లికేషన్ ప్రింట్​అవుట్​ను భద్రపరుచుకోవాలి.

ముఖ్యమైన తేదీలు

  • ఆన్​లైన్ దరఖాస్తు ప్రారంభం : 2024 అక్టోబర్ 9
  • ఆన్​లైన్ దరఖాస్తుకు చివరి తేదీ : 2024 అక్టోబర్ 23

ముఖ్యాంశాలు

  • కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌ లిమిటెడ్‌ (CSL) 307 అప్రెంటిస్‌ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల.
  • ఐటీఐ, ఒకేషనల్ హయ్యర్ సెకండరీ ఎడ్యుకేషన్ పూర్తి చేసిన వారు ఈ పోస్టులకు అర్హులు.
  • ఆన్​లైన్​లో దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 2024 అక్టోబర్ 23

ABOUT THE AUTHOR

...view details