Best Non Engineering Jobs For Engineers :ప్రస్తుత కాలంలో ఇంజినీరింగ్ ఉద్యోగాలకే కాదు నాన్-ఇంజినీరింగ్ ఉద్యోగాలకు కూడా బాగా ప్రాధాన్యం పెరిగింది. కొంత మంది ఇంజినీరింగ్ చేసినప్పటికీ, సరైన అవకాశాలు లేక నాన్ ఇంజినీరింగ్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ ఆర్టికల్. జాబ్ మార్కెట్లో బెస్ట్ నాన్-ఇంజినీరింగ్ ఉద్యోగాలేంటి? వాటిని పొందాలంటే ఎలాంటి నైపుణ్యాలు ఉండాలి? అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం.
- టెక్నికల్ రైటర్స్ :సైంటిఫిక్, మెకానికల్, టెక్నాలజీ అంశాలకు సంబంధించి ఇన్స్ట్రక్షన్ మెటీరియల్స్, ఆపరేషన్ డాక్యుమెంట్లను రాయడమే ఈ టెక్నికల్ రైటర్స్ ప్రధానమైన పని. ఉదాహరణకు తయారీ రంగంలో పనిచేస్తున్న వారికి ఇన్స్ట్రక్షన్ మాన్యువల్ లాంటివి రూపొందించవచ్చు. దీనివల్ల ఆ సంస్థలో పనిచేస్తున్న వారికి ఆ మాన్యువల్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
- లాజిస్టిక్స్ :రవాణా కంపెనీలు, వేర్‌హౌస్‌లు లేదా తయారీ ప్లాంట్లలో ప్రొడక్ట్‌లను నిల్వ చేయడం, డెలివరీస్ అందివ్వడం లాజిస్టిక్స్ మేనేజర్ ప్రధానమైన విధి. హోల్‌సేల్ లేదా ఇతర వేర్‌హౌస్ సిబ్బందితో ప్రొడక్ట్ ఆర్డర్లు, డెలివరీ టైమింగ్స్ నిర్వహణ లాంటి విషయాలను చూసుకునేందుకే ఈ లాజిస్టిక్స్ మేనేజర్లను నియమిస్తుంటారు.
- మాన్యుఫాక్చురింగ్ మేనేజర్ :తయారీ సంస్థల్లో రోజువారీ పనులను పర్యవేక్షించడం మాన్యుఫాక్చురింగ్ మేనేజర్ల ముఖ్యమైన పని. వీటితో పాటు సూపర్వైజర్లను నియమించడం, శిక్షణ ఇవ్వడం మొదలైన వ్యవహరాలన్నింటిని చూసుకోవాల్సిన బాధ్యత ఈ మాన్యుఫాక్చురింగ్ మనేజర్స్పై ఉంటుంది.
- టెక్నికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ :ప్రొడక్టులను గురించి వివరించి సేల్స్‌ను పెంచేందుకు ఈ టెక్నికల్ సేల్స్ రిప్రజెంటేటివ్ పనిచేయాల్సి ఉంటుంది. అందుకే ఆయా ప్రొడక్టుల గురించి మీకు పూర్తి అవగాహన ఉండాలి. ఈ రంగంలో మంచి స్థాయికి వెళ్లాలంటే గొప్ప నైపుణ్యాలను ఉపయోగించి పనిచేయాల్సి ఉంటుంది.
- టెక్నికల్ కన్సల్టెంట్ జాబ్ :వ్యాపార సంస్థలకు ఏవైనా బిజినెస్ సంబంధించిన సమస్యలు ఎదురైనప్పుడు సలహాలు, సూచనలు అందించడమే ఈ టెక్నికల్ కన్సల్టెంట్ల ముఖ్యమైన పని. మీరు సూచించే పరిష్కార మార్గాల వల్ల సంస్థ మరింత లాభాల్లోకి వెళ్లవచ్చు. అందువల్లే చాలా సంస్థలు టెక్నికల్ కన్సల్టెంట్లను రిక్రూట్ చేసుకుంటూ ఉంటాయి. ఒక వేళ మీకు ఈ రంగంపై ఆసక్తి ఉంటే వ్యాపార రంగంలో మంచి అవకాశాలు సొంతం చేసుకోవచ్చు.
- టీచింగ్ జాబ్స్ :ఇంజినీరింగ్ కాలేజ్‌లో టీచింగ్ విభాగంలో జాబ్లకు మంచి డిమాండ్ ఉంటుంది. స్టూడెంట్స్‌కు సబ్జెక్టుతో పాటు విశ్లేషణాత్మక నైపుణ్యాలు పెంచడం, ప్రొబ్లమ్ సాల్వింగ్ స్కిల్‌ను పెంపొందించడంమే ఈ టీచింగ్ జాబ్స్ ముఖ్యమైన పని. సబ్జెక్టుపై అవగాహన ఉంటే మంచి వేతనంతో జాబ్‌ను సొంతం చేసుకోవచ్చు.
- స్టాక్ ట్రేడర్ :స్టాక్ ట్రేడర్ షేర్ మార్కెట్లో అమ్మకాలు కొనుగోలును చేస్తుంటారు. సాధారణంగా ఈ ట్రేడర్లు వివిధ సంస్థల ట్రేడింగ్ చేస్తుంటారు.
- కన్స్ట్రక్షన్ మేనేజర్ :కన్స్ట్రక్షన్ కంపెనీలు వారు చేపడుతున్న నిర్మాణాలను పర్యవేక్షించడానికి మేనేజర్లను నియమించుకుంటాయి. ఈ ఉద్యోగాలు సైతం మంచి ఆకర్షణీయమైన వేతనం ఉంటుంది.
- కంటెంట్ క్రియేటర్ :హెల్త్, టెక్నాలజీ, బిజినెస్, రాజకీయాలు ఇలా వివిధ అంశాలను డిజిటల్ మీడియాకు, బ్లాగ్‌లకు రాసేవారినే కంటెంట్ క్రియేటర్ అంటారు. ప్రస్తుతం జాబ్మార్కెట్లో ఈ ఉద్యోగాలకు చాలా డిమాండ్ ఉంది.
- గ్రాఫిక్స్ డిజైనర్స్ :సాఫ్ట్వేర్ ప్రోగ్రాంలను ఉపయోగించి వెబ్సైట్ లేఔట్స్, ఇన్ఫోగ్రాఫిక్స్, మ్యాగజైన్స్‌ను క్రియేట్ చేసేవారిని గ్రాఫిక్ డిజైనర్లు అంటారు. వీరికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది.