Admissions to Ekalavya Model Gurukul Vidyalayas for the Academic Year 2025-26 :గిరిజన ప్రాంతాల్లో జాతీయ స్థాయిలో ఉన్నత ప్రమాణాలతో విద్య అందించాలనే లక్ష్యంతో ఏకలవ్య మోడల్ గురుకుల పాఠశాలలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ విద్యాలయాల్లో ఆంగ్ల మాధ్యమంలో సీబీఎస్‌ఈ సిలబస్‌ను బోధిస్తారు. రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి ఏకలవ్య మోడల్ గురుకుల విద్యాలయాలలో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది.
పాఠశాలల ప్రత్యేకతలు :
- సీబీఎస్‌ఈ సిలబస్‌తో ఆరు నుంచి 12 తరగతి వరకు ఏకలవ్య పాఠశాలలు ఉంటాయి.
- ఒక్కో తరగతికి 60 (బాలురు 30, బాలికలు 30) మంది విద్యార్థులు ఉంటారు.
- విశాలమైన తరగతి గదులు, ప్రయోగశాలలు, కంప్యూటర్ ల్యాబ్‌లు, గ్రంథాలయాలు, ఆటస్థలం తదితర సౌకర్యాలు ఉంటాయి.
- బాలబాలికలకు వేర్వేరుగా ఆధునిక సౌకర్యాలతో డార్మిటరీలు, ఆధునిక వంట గది, విశాలమైన భోజనశాల, క్రీడా ప్రాంగణం, సాంస్కృతిక రంగాల్లో ప్రత్యేక శిక్షణ.
- స్మార్ట్ విద్యాబోధనలో భాగంగా విద్యార్థులకు డిజిటల్, వర్చువల్ విధానంలో తరగతుల నిర్వహణ.
వయస్సు :ఆరో తరగతిలో ప్రవేశానికి 10 నుంచి 13 ఏళ్ల వయస్సు ఉండాలి.
అర్హతలు : ఈ పాఠశాలల్లో ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకునే బాలబాలికలు జిల్లాలో ఏదైనా ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2024-25 విద్యా సంవత్సరంలో అయిదో తరగతి చదివి ఉండాలి. విద్యాహక్కు చట్టం 2009, సెక్షన్ 4 ప్రకారం విద్యార్థి ఇంటి వద్దనే అయిదో తరగతి చదివిన వారు కూడా అర్హులే. అయితే విద్యార్థి తల్లిదండ్రులు/సంరక్షకుడు డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగు మాధ్యమంలో చదివిన వారూ రాత పరీక్షకు అర్హులే.