AAI Recruitment 2024 : ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా 490 జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ డిగ్రీలు చేసినవారు ఈ పోస్టులకు అర్హులు.
ఉద్యోగాల వివరాలు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఆర్కిటెక్చర్) - 3 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (సివిల్ ఇంజినీరింగ్) - 90 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్) - 106 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఎలక్ట్రానిక్స్) - 278 పోస్టులు
- జూనియర్ ఎగ్జిక్యూటివ్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) - 13 పోస్టులు
- మొత్తం పోస్టులు - 490
విద్యార్హతలు
AAI Jr Executive Job Qualifications :అభ్యర్థులు ఆయా పోస్టులకు అనుగుణంగా (సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) ఇంజినీరింగ్, ఆర్కిటెక్చర్ డిగ్రీలు చేసి ఉండాలి. అలాగే గేట్-2024 ఎగ్జామ్లో కచ్చితంగా క్వాలిఫై అయ్యుండాలి.
వయోపరిమితి
AAI Jr Executive Job Age Limit :అభ్యర్థుల వయస్సు 2024 మే 1 నాటికి 27 ఏళ్లు మించి ఉండకూడదు. అయితే ప్రభుత్వ నిబంధనల ప్రకారం, వివిధ కేటగిరీల అభ్యర్థులకు వయోపరిమితి సడలింపులు వర్తిస్తాయి.
దరఖాస్తు రుసుము
AAI Jr Executive Job Application Fee :జనరల్, ఓబీసీ అభ్యర్థులు అప్లికేషన్ ఫీజుగా రూ.300 చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్, అప్రెంటీస్ క్యాండిడేట్లు దరఖాస్తు రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు.