తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ క్రెడిట్ కార్డ్​ ఎక్స్​పైర్​ అయ్యిందా ? పెండింగ్ బిల్స్​ను ఈజీగా చెల్లించండిలా!

మీ క్రెడిట్ కార్డ్ గడువు ముగిసిందా? మీరు చెల్లించాల్సిన బకాయిలు ఇంకా ఉన్నాయా? డోంట్ వర్రీ - ఈ సింపుల్ ప్రాసెస్ ఫాలో అవ్వండి!

Credit Card
Credit Card (ANI)

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

How To Pay Dues Of Expired Credit Card : వ్యక్తిగత అత్యవసరాలు కారణంగా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లింపులు ఆలస్యమవుతుంటాయి. అలా జరిగినప్పుడు ఫెనాల్టీ, వడ్డీ వంటి అదనపు ఛార్జీలను భరించక తప్పదు. కొన్ని సార్లు క్రెడిట్ కార్డ్ గడువు కూడా ముగిసిపోతుంది. బకాయిల చెల్లింపు అలానే ఉంటుంది. బిల్లుల గడువు ముగిసే లోపు బకాయిలు క్లియర్​ చేయడంలో విఫలమైతే దాని ప్రభావం క్రెడిట్​ సోర్క్​పై పడుతుంది. గడువు ముగిసి క్రెడిట్​ కార్డ్​తో పెండింగ్​ బిల్లులను చెల్లించవచ్చు అదేలాగో ఈ స్టోరీలో తెలుసుకుందాం.

క్రెడిట్ కార్డ్ గడువు ముగిస్తే
క్రెడిట్ కార్డ్ గడువు తేదీ ముగిసినా బకాయిలు, బ్యాలెన్ అలానే ఉంటుంది అకౌంట్​ కూడా క్లోజ్ కాదు. సాధారణంగా బ్యాంకులు గడువు తేదీ లోపే కొత్త కార్డ్​ను జారీ చేస్తుంది.

గడువు ముగిసినా కార్డ్​తో చెల్లింపులు
ఆన్​లైన్​ అకౌంట్​ ద్వారా వివరాలు
క్రెడిట్ కార్డ్ గడువు ముగిసినప్పటికీ, అకౌంట్​ను ఆన్‌లైన్‌లో లేదా మీ బ్యాంక్ మొబైల్ యాప్ ద్వారా యాక్సెస్ చేయవచ్చు. మీ ఖాతాలో ఏవైనా పెండింగ్ బ్యాలెన్స్, బకాయిలు, వాటి గడువు తేదీ గురించి తెలుసుకోవచ్చు. ఇంకా క్లారిటీ కోసం స్టెట్​మెంట్​ను చూడొచ్చు.

మొబైల్ బ్యాకింగ్ ద్వారా
చాలా బ్యాంకులు క్రెడిట్ కార్డ్ బిల్లులను ఆన్‌లైన్‌లో చెల్లించేందుకు అనుమతి ఇస్తాయి. గడువు ముగిసిన కార్డులకు కూడా అనుమతి ఉంటుంది. బకాయిలను చెల్లించేందుకు నెట్​ బ్యాంకింగ్ లేదా, మొబైల్​ యాప్​ను ఉపయోగించవచ్చు.

  • నెట్​ బ్యాంకింగ్ లేదా మొబైల్​ యాప్​లో లాగిన్ చేయాలి.
  • క్రెడిట్ కార్డ్ లేదా బిల్​ పేమెంట్ సెక్షన్​లోకి వెళ్లాలి
  • తర్వాత గడువు ముగిసిన కార్డ్​ వివరాలను నమోదు చేయాలి.
  • లింక్​ చేసిన బ్యాంక్​ అకౌంట్​ లేదా యూపీఐ ద్వారా పెండింగ్​లో ఉన్న మొత్తాన్ని చెల్లించాలి.

NEFT/RTGS ఉపయోగించి
మీరు నేషనల్ ఎలక్ట్రానిక్ ఫండ్స్ ట్రాన్స్ఫర్(NEFT ) లేదా రియల్-టైమ్ గ్రాస్ సెటిల్మెంట్ (RTGS ) ఉపయోగించి మీ క్రెడిట్ కార్డ్ బకాయిలను చెల్లించవచ్చు.

క్రెడిట్​ కార్డ్ ఉన్న అకౌంట్​ నంబర్​ను ఉపయోగించి నెట్​ బ్యాంకింగ్​ ద్వారా బకాయిలను చెల్లించాలి

బకాయిల చెల్లింపుల కోసం క్రెడిట్ కార్డ్ జారీ చేసిన బ్యాంక్ IFSC కోడ్​ను కరెక్ట్​గా ఉండాలి.

చెక్/క్యాష్ పేమెంట్స్
ఆన్​లైన్​లో కుదరకపోతే నేరుగా బ్యాంక్​కు వెళ్లి బకాయిలను చెల్లించవచ్చు. అందుకోసం చెక్​పై క్రెడిట్ కార్డ్​ అకౌంట్ నంబర్​ను రాసి ఇవ్వచ్చు. లేదంటే ఖాతాకు నేరుగా నగదును జమ చేయొచ్చు(కానీ అదనపు ఛార్జీలు ఉంటాయి)

పేమెంట్ యాప్స్​ ద్వారా
గూగుల్ పే, ఫోన్​ పే వంటి యాప్​లు కూడా క్రెడిట్ కార్డ్ బిల్లులను చెల్లించవచ్చు. సంబంధిత యాప్​లోకి వెళ్లి 'క్రెడిట్ కార్డ్ పేమెంట్' ఆప్షన్​ ఎంచుకోవాలి. అందులో క్రెడిట్ కార్డ్ వివరాలను నమోదు చేసి బకాయిలను చెల్లించవచ్చు.

బ్యాంక్​ కస్టమర్​ను సంప్రదించండి
బకాయిలు చెల్లించడానికి ఏమి చేయాలో తెలిసినప్పుడు బ్యాంక్ కస్టమర్​ను సంప్రదించండి. వాళ్లు గడువు ముగిసిన కార్డ్​ బకాయిల ఎలా చెల్లించాలో చెబుతారు.

గడువు తేదీ లోపు కొత్త క్రెడిట్ కార్డ్ రాకపోతే?
పాత కార్డు గడువు ముగియడానికి కొన్ని వారాల ముందే బ్యాంకులు రీప్లేస్‌మెంట్ కార్డ్‌లను జారీ చేస్తాయి. ఒక వేళ కార్డ్​ రాకపోతే మీ బ్యాంక్​కు కాల్​ చేసి ఎందుకు ఆలస్యమైందో తెలుసుకోండి. ఈ లోపు మీ బకాయిలను పై పద్ధతుల ద్వారా చెల్లించండి. సకాలంలో చెల్లించకపోతే క్రెడిట్​ స్కోర్​పై ప్రభావం పడుతుంది. అది భవిష్యత్తులో రుణాలు పొందడం కష్టమవుతుంది.

ఫ్యామిలీ కోసం ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ - బెస్ట్ బెనిఫిట్స్ ఇవే!

కొత్తగా క్రెడిట్ కార్డు తీసుకోవాలా? మంచి రివార్డ్స్, డిస్కౌంట్స్ అందించేవి ఇవే! - Best Credit Cards 2024

ABOUT THE AUTHOR

...view details