తెలంగాణ

telangana

ETV Bharat / business

మీరు రిజర్వ్ చేసుకున్న ట్రైన్​ సీట్లో మరొకరు కూర్చున్నారా? డోంట్​ వర్రీ - ఇలా చేస్తే ఆల్​ సెట్​! - Train Reservation Rules - TRAIN RESERVATION RULES

What To Do If Someone Else Occupies Your Reserved Seat On The Train : మీరు ట్రైన్ టికెట్​ను రిజర్వ్​ చేసుకున్నారా? కానీ మీ రిజర్వ్డ్ సీట్​లో వేరొకరు కూర్చున్నారా? ఎంత చెప్పినా సీటు నుంచి లేవడం లేదా? డోంట్​ వర్రీ. సదరు వ్యక్తితో మీరు గొడవపడాల్సిన అవసరం లేదు. ఈ స్టోరీలో చెప్పిన పని చేస్తే చాలు - మీ సమస్యను రైల్వే వాళ్లే పరిష్కరిస్తారు. మీ సీటు మీకు ఇప్పిస్తారు.

indian trains
What to do if someone else occupies your reserved seat on the train? (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : May 28, 2024, 3:53 PM IST

What To Do If Someone Else Occupies Your Reserved Seat On The Train : దూర ప్రయాణమనగానే ఎక్కువ మంది ఓటేసేది రైళ్లకే. తక్కువ ఖర్చుతో రైలులో సౌకర్యవంతంగా ప్రయాణం చేయవచ్చు. అందుకే ఎక్కువ మంది రైలు ప్రయాణం చేయడానికి ఇష్టపడుతుంటారు. అయితే ఒక్కోసారి రైలు టికెట్​ను రిజర్వేషన్ చేసుకున్నా సరే, ఆ సీట్లో ఎవరో వేరేవారు కూర్చుని ఉంటారు. సీటు ఖాళీ చేయాలని ఎంత చెప్పినా ఒప్పుకోరు. దీంతో వారితో మీరు గొడవ పడాల్సి వస్తుంది. అయితే ఎలాంటి గొడవలు, ఘర్షణలు లేకుండా, చాలా ఈజీగా మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటును పొందొచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.

ఫిర్యాదు చేయండిలా!
మీరు రిజర్వేషన్ చేసుకున్న సీటుపై ఇంకెవరైనా కూర్చుంటే, రైల్వే శాఖకు ఆన్​లైన్​లో ఫిర్యాదు చేయవచ్చు. లేదా ఫోన్ చేసి కంప్లైంట్​ ఇవ్వవచ్చు. రైలు ప్రయాణికుల ఫిర్యాదులను సత్వరం పరిష్కరించడానికి, అలాగే వారికి సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందించేందుకు రైల్వే శాఖ పలు చర్యలు తీసుకుంటోంది. అందులో భాగంగా ట్రైన్​లోని సమస్యలపై ఫిర్యాదు చేయడానికి రైల్​మదద్​ అనే వెబ్​సైట్​ను అందుబాటులోకి తెచ్చింది. అలాగే ఓ టోల్​ఫ్రీ నంబర్​ను కూడా ఏర్పాటు చేసింది. ముందుగా మనం ఆన్​లైన్​లో ఎలా ఫిర్యాదు చేయాలో తెలుసుకుందాం.

మీరు రిజర్వ్​ చేసుకున్న సీటును తిరిగిపొందేందుకు ఆన్​లైన్​లో ఎలా ఫిర్యాదు చేయాలంటే?

  • ముందుగా మీరు రైల్​మదద్ వైబ్​సైట్ https://railmadad.indianrailways.gov.in ను ఓపెన్ చేయాలి.
  • వైబ్​సైట్​లో మీ రైలు పేరు, పీఎన్​ఆర్ నంబర్, సీటు నంబర్ ఎంటర్ చేయాలి. అంతే సింపుల్​!
  • మీరు చేసిన ఫిర్యాదు వెంటనే రైల్వే శాఖకు అందుతుంది. వారు తగిన చర్యలు తీసుకుని మీ సీటును మీకు ఇప్పిస్తారు.
  • మీరు కావాలనుకుంటే, కంప్లైంట్ స్టేటస్​ను కూడా ఆన్​లైన్​లో చూసుకునే వెసులుబాటు ఉంది.

రైల్వే హెల్ప్​లైన్​ ద్వారా ఫిర్యాదు చేయడం ఎలా?

  • ఆన్​లైన్​లో ఫిర్యాదు చేయలేనివారు, రైల్వే హెల్ప్​లైన్​ నంబర్​ 139కి కాల్ చేసి కంప్లైంట్​ ఇవ్వవచ్చు.
  • మీరు 139కు కాల్ చేసిన తరువాత, కస్టమర్ సర్వీస్ ఏజెంట్​కు మీ ట్రైన్​ పేరు, పీఎన్​ఆర్​ నంబర్​, సీట్ నంబర్ వివరాలు తెలియజేయాలి.
  • వెంటనే రైల్వే అధికారులు తగిన చర్యలు తీసుకుని, మీ రిజర్వ్డ్​ సీట్​ను మీకు ఇప్పిస్తారు. అంతే సింపుల్​!

మంచి మైలేజ్ ఇచ్చే స్కూటర్ కొనాలా? టాప్​-10 ఆప్షన్స్ ఇవే! - Best Mileage Scooters

'మే 31లోగా పాన్‌ను ఆధార్‌తో లింక్ చేసుకోండి - లేదంటే భారీగా TDS వడ్డన తప్పదు' - ఐటీ శాఖ - PAN Aadhaar Link

ABOUT THE AUTHOR

...view details