తెలంగాణ

telangana

ETV Bharat / business

మీ పాత కార్‌ను సేల్ చేయాలా? ఈ 9 డాక్యుమెంట్స్‌ మస్ట్‌! - CAR SELL DOCUMENTS

మీ పాత కారుని అమ్మాలని అనుకుంటున్నారా? ఈ 9 పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే!

Car Sell Documents
Car Sell Documents (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : 10 hours ago

Car Sell Documents :మీ పాత కారును అమ్మాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. భారతదేశంలో పాత కారును అమ్మాలంటే కొన్ని కీలక పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే. అవేంటో ఈ ఆర్టికల్‌లో తెలుసుకుందాం.

  1. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ (RC) : కారు కొనేటప్పుడు మీ పేరున దానిని కచ్చితంగా రిజిస్ట్రేషన్‌ చేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడు ఆర్‌టీఓ కార్యాలయం మీకు ఆర్‌సీ జారీ చేస్తుంది. అప్పుడే మీరు సదరు వాహనానికి నిజమైన యజమాని అవుతారు. అలాగే మీరు ఆ కారును తిరిగి అమ్మేటప్పుడు కూడా ఈ ఆర్‌సీని చూపించాల్సి ఉంటుంది. ఒకవేళ ఆర్‌సీ మీ పేరున లేకపోతే, దానిని ఇతరులకు ట్రాన్స్‌ఫర్ చేయడం కష్టమవుతుంది.
  2. ఫారమ్ 29 : కారును అమ్మేటప్పుడు ఆర్‌టీఓ ఆఫీస్‌లో కచ్చితంగా ఫారమ్‌ 29ని సమర్పించాలి. అప్పుడే ఎలాంటి సమస్య లేకుండా యాజమాన్య బదిలీ (ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్‌) జరుగుతుంది.
  3. ఫారమ్‌ 28 : కారుపైన ఎలాంటి అప్పులు, బకాయిలు లేవని నిర్ధరిస్తూ తెలియజేసే 'నో అబ్జెక్షన్ సర్టిఫికెట్' (ఎన్‌ఓసీ) ఇది.
  4. ఫొటోగ్రాఫ్స్‌ :కారు అమ్మేటప్పుడు మీ సెల్ఫ్‌ అటాస్టెడ్‌ పాస్‌పోర్ట్ సైజ్ ఫొటోలు ఇవ్వాల్సి ఉంటుంది.
  5. ఫారమ్ 30 : ఇది కారు యాజమాన్య బదిలీకి కావాల్సిన మరో కీలక పత్రం. ఓనర్‌షిప్ ట్రాన్స్‌ఫర్‌ని వెంటనే ప్రారంభించాలని ఇది ఆర్‌టీఓకు తెలియజేస్తుంది.
  6. అడ్రస్ ప్రూఫ్‌ : మీ చిరునామా వివరాల కోసం ఆధార్‌ కార్డ్, పాస్‌పోర్ట్ లాంటివి సమర్పించవచ్చు. అయితే వీటికి కూడా సెల్ఫ్ -అటాస్టేషన్‌ తప్పనిసరి.
  7. పాన్‌ కార్డ్ :మీరు పన్ను ప్రయోజనాలు పొందాలంటే, కచ్చితంగా సెల్ఫ్‌-అటాస్టెడ్ పాన్‌ కార్డ్‌ను సమర్పించాలి.
  8. కార్ ఇన్సూరెన్స్ :కారు యాజమాన్య బదిలీకి తప్పనిసరిగా యాక్టివ్ కార్‌ ఇన్సూరెన్స్ పాలసీ ఉండాలి. ఒక వేళ ఇప్పటికీ మీ కారు బీమా పాలసీ ముగిసినట్లయితే, వెంటనే దానిని పునరుద్ధరించుకోవాలి. లేదా లీగల్ ఇష్యూస్‌ రాకుండా థర్డ్‌ పార్టీ ఇన్సూరెన్స్ తీసుకోవాలి.
  9. పొల్యూషన్ అండర్ కంట్రోల్ సర్టిఫికెట్‌ (PUC) : మీ కారు ఉద్గారాలు నిర్దేశిత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నట్లుగా నిర్ధరిస్తూ ఇచ్చే పీయూసీ సర్టిఫికెట్‌ను కూడా సమర్పించాల్సి ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details