Upcoming Maruti Cars In India : మన దేశంలో పరిచయం అక్కరలేని పేరు మారుతి సుజుకి. ఏటా అత్యధిక కార్ల సేల్స్‌తో ఈ కంపెనీ టాప్ ప్లేస్‌లో నిలుస్తుంటుంది. మారుతి సుజుకి త్వరలో 12 మోడల్స్‌ను (కార్లను) ఇండియన్ మార్కెట్‌లో విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. ఈ న్యూ మోడల్ కార్లలో కొత్త రకం ఇంజిన్లు, ఫీచర్లు ఉంటాయని తెలుస్తోంది. మరెందుకు ఆలస్యం మారుతి సుజుకి భారత విపణిలోకి తీసుకురానున్న ఆ కార్లు ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
1. Maruti Dzire 2024 : మారుతి డిజైర్ కారు 1.2 లీటర్, 3 సిలిండర్ మైల్డ్-హైబ్రిడ్ ఇంజిన్‌ను కలిగి ఉంటుంది. ఇది 82 పీఎస్ పవర్, 108 ఎన్ఎం టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆటోమేటిక్ ఏసీ, క్రూయిజ్ కంట్రోల్, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. ఈ జూన్‌లోనే ఇది విడుదల అవుతుందని అనుకున్నారు. కానీ సెప్టెంబర్ నెలలో ఇది లాంఛ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
- ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.7 లక్షలు
- ఇంజిన్ : 1197 సీసీ
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- బాడీ టైప్ : సెడాన్
2. Maruti Suzuki Swift Hybrid : మారుతి సుజుకి స్విఫ్ట్ హైబ్రిడ్ కారు ఈ ఏడాది సెప్టెంబర్‌లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఇది పెట్రోల్ ఇంజిన్ సహా, 13.5 పీఎస్ పవర్‌తో కూడిన ఎలక్ట్రిక్ మోటార్ కలిగి ఉంటుంది. వెంటిలేటెడ్ పాడిల్ షిఫ్టర్లు, క్రూయిజ్ కంట్రోల్, ఫ్రంట్ సీట్లు సహా, అధునాతన ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి రానుంది.
- ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.10 లక్షలు
- ఇంజిన్ : 1197 సీసీ
- మైలేజ్ : 32 కి.మీలకు పైగా
- సీటింగ్ కెపాసిటీ : 5
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
3. Maruti Suzuki eVX : ఈ ఏడాది డిసెంబరులో మారుతి సుజుకి ఈవీఎక్స్ భారత మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉంది. డ్యూయల్ ఎలక్ట్రిక్ మోటారుతో ఈ కారు లభిస్తుంది. ఎల్ఈడీ లైట్ ఎలిమెంట్స్, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో ఈ కారు అందుబాటులోకి రానుంది.
- ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.22 లక్షలు
- రేంజ్ : 550 కి.మీపైగా
- మైలేజ్ : 32 కి.మీలకు పైగా
- బ్యాటరీ కెపాసిటీ : 60 kWh
- సీటింగ్ కెపాసిటీ : 5
- ట్రాన్స్మిషన్ : ఆటోమేటిక్
- ఫ్యూయల్ టైప్ : ఎలక్ట్రిక్
- బాడీ టైప్ : ఎస్యూవీ
4. Maruti Suzuki XL5 : బడ్జెట్లో కారు కొనాలనుకునేవారికి మారుతి సుజుకి ఎక్స్ఎల్5 మంచి ఆప్షన్ అవుతుంది. ఎల్ఈడీ డీఆర్ఎల్తో కొత్త ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, స్టార్ట్/స్టాప్ పుష్-బటన్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, 15 అంగుళాల అల్లాయ్ వీల్స్‌లో ఈ మోడల్ కారు వస్తుంది. ఈ కారు వచ్చే ఏడాది సెప్టెంబరులో మార్కెట్లోకి రానున్నట్లు తెలుస్తోంది.
- ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.5 లక్షలు
- ఇంజిన్ : 998 సీసీ
- మైలేజ్ : 20.52 కి.మీలకు పైగా
- సీటింగ్ కెపాసిటీ : 5
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్
- ఫ్యూయల్ టైప్ : పెట్రోల్
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
5. Maruti Suzuki WagonR Electric : మారుతి సుజుకి వ్యాగన్-ఆర్ ఎలక్ట్రిక్ కారు గ్యాసోలిన్ శక్తితో నడుస్తుంది. పొడవైన, బాక్సీ డిజైన్‌ను కలిగి ఉంటుంది. రీజెనరేటివ్ బ్రేకింగ్, పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, స్టార్ట్/స్టాప్ పుష్ బటన్ వంటి ఫీచర్లను కలిగి ఉంటుంది. అల్లాయ్ వీల్స్, గ్రిల్, ఫ్రంట్ బంపర్‌తో ఇది వస్తుంది. 2026 జనవరిలో ఈ కారు భారత మార్కెట్లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
- ఎక్స్-షోరూమ్ ధర : ప్రారంభ ధర రూ.8.5 లక్షలు
- సీటింగ్ కెపాసిటీ : 5
- బాడీ టైప్ : హ్యాచ్‌బ్యాక్
6. Maruti Futuro-e : మారుతి ఫ్యూచురో-ఈ కారుని ఆటో ఎక్స్పో 2020లోనే ఇంట్రడ్యూస్ చేశారు. ప్రస్తుతం ఇది కన్సెప్టివల్ స్టేజ్‌లోనే ఉందని సమాచారం. ఈ కారును బ్లూ, ఐవరీ లుక్‌తో రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. దీని లాంఛింగ్ డేట్ గురించి కంపెనీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు.
- ఎక్స్-షోరూమ్ ధర : సుమారు రూ.15 లక్షలు
- సీటింగ్ కెపాసిటీ : 5
- ట్రాన్స్మిషన్ : మాన్యువల్
- ఫ్యూయల్ టైప్ : ఎలక్ట్రిక్
- బాడీ టైప్ : ఎస్యూవీ