Upcoming EV Cars In India 2024 : ఈ కాలంలో ఎలక్ట్రికల్ వాహనాల వినియోగం బాగా పెరుగుతోంది. పెట్రోల్, డీజిల్ లాంటి సహజ ఇంధన వనరులు కనుమరుగు కానున్న నేపథ్యంలో విద్యుత్తు వాహనాల వినియోగానికి ప్రజలు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే విదేశాల్లో ఈవీ కార్లను భారీ సంఖ్యలో ఉపయోగిస్తున్నారు. మనదేశంలోనూ క్రమంగా వీటిని వాడే వారి సంఖ్య పెరుగుతోంది. అందుకే ఈ వాహనాల్ని తయారు చేయడానికీ ఉత్పత్తి సంస్థలు పోటీ పడుతున్నాయి. అందులో భాగంగా మారుతి సుజుకి, హ్యుందాయ్, మహీంద్రా, టాటా, కియా, స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ లాంటి టాప్ బ్రాండ్స్ ఈ ఏడాది తమ ఎలక్ట్రిక్ SUVలను లాంఛ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. అందుకే వాటిపై ఓ లుక్కేద్దాం రండి.
Maruti Suzuki eVX & Toyota EV :
మారుతి సుజుకి ఈ ఏడాది చివరిలో eVX అనే ఎలక్ట్రిక్ ఎస్యూవీ కారును లాంఛ్ చేయడానికి సిద్ధమవుతోంది. టయోటా 2025లో తన ఈవీ కారును లాంఛ్ చేయనుంది. ఈ మిడ్ రేంజ్ ఎలక్ట్రిక్ SUVలు రెండు బ్యాటరీలు, FWD/AWD కాన్ఫిగరేషన్లతో రానున్నాయి. ఈ ఈవీ కార్లను ఫుల్ ఛార్జ్ చేస్తే 500 కి.మీ రేంజ్ వరకు ప్రయాణించవచ్చని తెలుస్తోంది.
Skoda Enyaq iV & Volkswagen ID.4
స్కోడా, ఫోక్స్‌వ్యాగన్ కంపెనీలు ఈ సంవత్సరం ఇండియాలో తమ మొదటి ఎలక్ట్రిక్ కార్లను విడుదల చేయనున్నాయి. ఎన్యాక్ iV, ID.4 ఒకే ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి ఉంటాయి. వీటిని Completely Built-Up Unit (CBU) మార్గం ద్వారా దేశంలోకి తీసుకొస్తున్నారు. ఈ ఎలక్ట్రిక్ కార్ల ధర సుమారుగా రూ.50 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా.
Hyundai Creta EV
హ్యుందాయ్ క్రెటా ఎలక్ట్రిక్ వెర్షన్ ఈ ఏడాది చివరి నాటికి మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇది LG కెమ్ బ్యాటరీలతో వస్తుంది. ఇటీవలే వచ్చిన ఐసి-ఇంజిన్ క్రెటాతో పోల్చితే ఈ మోడల్ ఎక్స్టీరియర్ లుక్ చాలా బాగుంది. అయితే దీని ఫ్రంట్ వీల్స్ మాత్రం ఎంట్రీ-స్పెక్ కోనా ఎలక్ట్రిక్‌లో ఉన్న వీల్సే లాగానే ఉంటాయని సమాచారం.