Upcoming Bikes Under 1 Lakh :ఇండియాలో బైక్స్ వాడే వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతూ ఉంది. ఇండియాలో ఉన్న ఆటో మార్కెట్ పరంగా చూస్తే, సగటున ఒక కారు ఉంటే నాలుగు బైక్స్ ఉంటున్నాయి. చాలా మంది ఏ బైక్ కొనాలి అనే సందిగ్ధంలో ఉంటారు. వీటన్నింటికి చెక్ పెడుతూ మేము మీకోసం వివిధ కంపెనీలకు చెందిన రూ.1 లక్ష లోపు లభించే అప్‌కమింగ్ బైక్స్ వివరాలను ఇక్కడ ఇస్తున్నాం. ఈ బైక్స్ అన్నీ బహుశా ఈ సంవత్సరంలోనే లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
Honda Activa 7G :
హోండా యాక్టివా 7జీ ఇండియాలో ఒకే ఒక్క వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.79,000 (ఎక్స్-షోరూం) నుంచి ప్రారంభమవుతుంది. యాక్టివా 7జీ బీఎస్-6 ఇంజన్‌తో వస్తుంది. యాక్టివా 7జీ వివరాలు పూర్తిగా తెలియడంలేదు. కానీ ఈ స్కూటర్ పూర్తిగా డిజిటల్ కాకపోయినా, ప్రైమరీ బ్లూటూత్ కనెక్టివిటీతో సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో రావచ్చని సమాచారం. బహుశా దీనిలోని 109.51సీసీ సింగిల్-సిలిండర్ ఫ్యూయల్-ఇంజెక్ట్ ఇంజిన్‌ను కూడా మార్చకపోవచ్చు. ఇది 7.79 పీఎస్ పవర్, 8.84 ఎన్ఎమ్ టార్కును ఉత్పత్తి చేస్తుంది. ఇది ఏప్రిల్-2024లో లాంఛ్ అయ్యే అవకాశం ఉంది.
Bajaj CNG Bike
బజాజ్ సీఎన్‍జీ బైక్ ఇండియాలో సింగిల్ వేరియంట్‌లో అందుబాటులోకి రానుంది. దీని ధర రూ.80,000 నుంచి ప్రారంభమవుతుంది. దీనిలో హారిజాంటల్గా అమర్చిన 110 సీసీ ఇంజిన్ పెట్రోల్-పవర్డ్ బైక్ లాంటి పెర్ఫార్మెన్స్ను అందిస్తుందని కంపెనీ చెప్తోంది. దీని ధర సుమారు రూ.80,000 (ఎక్స్-షోరూమ్) ఉంటుందని అంచనా. బహుశా దీనిని ఏప్రిల్ 2024 - జూన్ 2024 మధ్య లాంఛ్ చేసే అవకాశం ఉంది.