Best Adventure Motorcycles :మీకు అడ్వెంచర్ ట్రావెలింగ్ అంటే చాలా ఇష్టమా? కొండలు, కోనలు, వాగులు, వంకలు అనే తేడా లేకుండా ప్రతిచోటకూ బైక్‌పై వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే ఇది మీ కోసమే. ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉన్న టాప్-10 అడ్వెంచర్ మోటార్ సైకిల్స్‌పై ఓ లుక్కేద్దాం రండి.
మనం టీవీల్లో చూస్తుంటాం. కొంత మంది బైక్ రైడ్ చేస్తూ కొండలను ఎక్కేస్తుంటారు. లేదా చిత్తడిగా ఉన్న నేలలో కూడా ఈజీగా బండి నడిపేస్తుంటారు. చిన్నచిన్న వాగులు, వంకలను కూడా సునాయాసంగా దాటేస్తూ ఉంటారు. అయితే మన దగ్గర ఉన్న సాధారణ మోటార్ సైకిళ్లతో ఇలా చేయడం కుదరదు. ఇలాంటి ఫీట్స్ చేయాలంటే, అడ్వెంటర్ మోటార్ సైకిళ్లను వాడాల్సిందే. అందుకే ఈ ఆర్టికల్‌లో టాప్-10 అడ్వెంటర్ మోటార్ సైకిళ్ల గురించి తెలుసుకుందాం.
1. Honda CRF300 Rally : ఈ హోండా మోటార్ సైకిల్‌లో 286 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 27 bhp పవర్, 26.6 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్) జనరేట్ చేస్తుంది. దీనిలో 12.8 లీటర్ సామర్థ్యం గల ట్యాంక్ ఉంటుంది.
- సీట్ హైట్ - 885 mm
- బరువు - 153 కేజీ
- టైర్స్ - 21/18
- సస్పెన్షన్ - ముందు వైపు 43 mm యూఎస్‌డీ ఫోర్క్స్ నాన్-అడ్జ్, వెనుక మోనోషాక్ ప్రీలోడ్ అడ్జ్ సస్పెన్షన్ ఉంటుంది.
ఈ ఆఫ్-రోడ్ బైక్‌తో చాలా లాంగ్ రేంజ్ వరకు సునాయాసంగా ప్రయాణించవచ్చు. దీని సీటు విశాలంగా ఉంటుంది. కనుక కూర్చోవడానికి చాలా అనువుగా ఉంటుంది. ఇంకా దీనిలో చాలా స్ట్రాంగ్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంటుంది.
Honda CRF300 Rally Price :ఈ బైక్ రూ.5,00,000 - రూ.5,20,000 ప్రైస్ రేంజ్‌లో ఉంటుంది.
2. Royal Enfield Himalayan 410 : యూత్‌లో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ బైక్‌లో 411 సీసీ సింగిల్-సిలిండర్, ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 24 bhp, 23.6 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్) జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 15 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. కాస్త తక్కువ ధరలో మంచి అడ్వెంచర్ బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- సీట్ హైట్ - 800 mm
- బరువు - 185 కేజీ
- టైర్స్ - 21/17
- సస్పెన్షన్ - ముందు వైపు 41 mm ఫోర్క్స్, వెనుక మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది.
Royal Enfield Himalayan 410 Price :మార్కెట్లో ఈ బైక్ ధర సుమారుగా రూ.2.16 లక్షల నుంచి రూ.2.29 లక్షల వరకు ఉంటుంది.
3. Royal Enfield Himalayan 450 :ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450 బైక్‌లో 452 సీసీ సింగిల్-సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 38 bhp, 29.5 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్) జనరేట్ చేస్తుంది. ఈ బైక్‌లో 17 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. ఈ రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ 450లో స్లిప్-అసిస్ట్ క్లచ్, 6 గేర్స్ ఉంటాయి.
- సీట్ హైట్ - 825-845 mm
- బరువు - 196 కేజీ
- టైర్స్ - 21/17
- సస్పెన్షన్ - ముందు వైపు 43 mm యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక షోవా మోనోషాక్ సస్పెన్షన్ ఉంటుంది.
Royal Enfield Himalayan 450 Price :ఈ బైక్ ధర సుమారుగా రూ.2.85 లక్షల - రూ.2.98 లక్షలు ఉంటుంది.
4. AJP PR7 Adventure 650 :ఏజేపీ పీఆర్7 అడ్వెంచర్ 650 బైక్‌లో 600 సీసీ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంటుంది. ఇది 48 bhp పవర్, 42.8 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్) ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆఫ్-రోడ్ మోటార్ సైకిల్‌లో 17 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. బురద నేలల్లో రైడ్ చేయాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
- సీట్ హైట్ - 920 mm
- బరువు - 165 కేజీ
- టైర్స్ - 21/18
- సస్పెన్షన్ - ముందు వైపు ఫుల్లీ అడ్జెస్టబుల్ 48 mm యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక వైపు ఫుల్లీ అడ్జెస్టబుల్ ఫోర్క్స్ ఉంటాయి.
AJP PR7 Adventure 650 Price :ఈ బైక్ ధర సుమారుగా రూ.11,25,000 నుంచి రూ.15,44,000 వరకు ఉంటుంది.
5. Honda CB500X : ఈ హోండా సీబీ500 ఎక్స్ బైక్‌లో 471 సీసీ ప్యారలల్-ట్విన్ సిలిండర్ ఉంటుంది. ఇది 47 bhp పవర్, 31.7 ft-lb (ఫుట్ పౌండ్ ఫోర్స్) ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆఫ్-రోడ్ మోటార్ సైకిల్‌లో 17.7 లీటర్ల సామర్థ్యం కలిగిన ఫ్యూయెల్ ట్యాంక్ ఉంటుంది. మొదటిసారి అడ్వెంచర్ బైక్ కొనాలని ఆశిస్తున్నవారికి ఈ హోండా సీబీ500 ఎక్స్ మంచి ఆప్షన్ అవుతుందని చెప్పుకోవచ్చు.
- సీట్ హైట్ - 830 mm
- బరువు - 199 కేజీ
- టైర్స్ - 19/17
- సస్పెన్షన్ - ముందు వైపు ప్రీలోడ్ అడ్జెస్టబుల్ 41 mm యూఎస్‌డీ ఫోర్క్స్, వెనుక వైపు ప్రీలోడ్ అడ్జెస్టబుల్ మోనోషాక్ ఫోర్క్స్ ఉంటాయి.