TATA's Business Journey :టాటా గ్రూప్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థ సాల్ట్(ఉప్పు) నుంచి సాఫ్ట్వేర్ వరకు దాదాపు 100 రంగాల్లో వ్యాపారాలు చేస్తోంది. అలాగే టీసీఎస్, టాటా మోటార్స్ వంటివి నెలకొల్పి రాణిస్తోంది. దాదాపు 150 ఏళ్లుగా దేశంలో వ్యాపార రంగంలో రాణిస్తున్న టాటా వంశవృక్షం గురించి ఈ స్టోరీలో తెలుసుకుందాం. జంషెడ్జీ టాటా నుంచి రతన్, మాయా టాటా వరకు వారు చేసిన వ్యాపారులు గురించి చూద్దాం.
జంషెడ్జీ టాటా
జంషెడ్జీ టాటా 1839వ సంవత్సరంలో గుజరాత్‌లోని నవసారి జిల్లాలో జన్మించారు. ఆయనకు దేశభక్తి ఎక్కువ. జంషెడ్జీ టాటా తన వ్యాపారాల వల్ల కొందరికైనా జీవనోపాధి ఇవ్వాలని అనుకునేవారు. 1868లో తొలుత పత్తి(కాటన్) వ్యాపారాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత లగ్జరీ హోటల్, తాజ్ హోటల్ వంటివి నిర్మించారు. జంషెడ్ మరణాంతరం తన వ్యాపార సామాజ్యాన్ని ఆయన కుమారుడు దొరాబ్జీ టాటాకు అప్పగించారు.
జంషెడ్ జీ టాటా చేసిన వ్యాపారాలు - పత్తి(కాటన్), స్టీల్, టెక్స్ టైల్స్
దొరాబ్జీ టాటా
దొరాబ్జీ టాటా 1959లో జన్మించారు. తన తండ్రి జంషెడ్జీ టాటా నుంచి వ్యాపార వారసత్వాన్ని అందుకున్నారు. వ్యాపారంలో తన తండ్రి సాధించాలనుకున్న వాటన్నింటినీ దొరాబ్జీ సాకారం చేశారు. టాటా గ్రూప్‌ను గణనీయంగా విస్తరించారు. దొరాబ్జీ టాటాకు క్రీడలంటే చాలా ఇష్టం. అందుకే 1924లో పారిస్ ఒలింపిక్స్‌కు వెళ్లిన భారత బృందానికి ఆర్థిక సాయం చేశారు. ఈయన తన భార్య మరణానంతరం ఓ ట్రస్ట్‌ను ఏర్పాటు చేశారు. ఇది కులం, జాతి, మతం అనే తేడా అందరికీ సాయం చేస్తుంది. అలాగే పరిశోధనలకు చేయూతనిస్తుంది, విపత్తు ఉపశమన చర్యలు చేపడుతుంది. దీనిని సర్ దొరాబ్జీ టాటా ట్రస్ట్ అని పిలిచేవారు.
దొరాబ్జీ టాటా చేసిన వ్యాపారాలు - టాటా పవర్, న్యూ ఇండియా అస్యూరెన్స్ (ప్రస్తుతం ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తోంది)
రతన్జీ టాటా
జంషెడ్జీ టాటా చిన్న కుమారుడైన రతన్జీ టాటా కూడా వ్యాపారంలో రాణించారు. ఈయన దానధర్మాలు ఎక్కువ చేసేవారు. రతన్జీ టాటా విపత్తు సహాయక చర్యలు చేపట్టేవారు. విద్యా సంస్థల కోసం, ఆరోగ్య సంరక్షణ కోసం నిధులు ఇచ్చేవారు. పురావస్తు శాఖ తవ్వకాలకు కూడా నిధులు సమకూర్చారు. 1916లో ఆయన తన సంపదలో గణనీయమైన భాగాన్ని ధార్మిక కార్యక్రమాలకు ఇచ్చారు. 1919లో సర్ రతన్ టాటా ట్రస్ట్‌ను స్థాపించారు. రతన్జీ టాటా మరణాంతరం, వ్యాపారాలన్నింటినీ ఆయన భార్య నవజ్ భాయ్ సేట్ కొంత కాలం చూసుకున్నారు.
నావల్ టాటా
రతన్జీ టాటా కుమారుడే నావల్ టాటా. ఈయన కూడా వ్యాపారంలో రాణించారు. నావల్ టాటా కుమారుడు ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా. ఉక్కు, టాటా పవర్ వ్యాపారాలను ఆయన విజయపథంలో నడిపించారు.