తెలంగాణ

telangana

ETV Bharat / business

అదరగొట్టిన దేశీయ స్టాక్​ మార్కెట్లు- సెన్సెక్స్@82559, నిఫ్టీ ఆల్​టైమ్​ రికార్డ్​ - Stock Market Today - STOCK MARKET TODAY

Stock Market Today September 2, 2024 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 13వ రోజు లాభాల్లో ట్రేడయ్యాయి. సోమవారం సెన్సెక్స్​, నిఫ్టీ జీవితకాల గరిష్ఠం వద్ద ముగిశాయి.

Share Market
Stock Market (Getty Images)

By ETV Bharat Telugu Team

Published : Sep 2, 2024, 9:47 AM IST

Updated : Sep 2, 2024, 3:58 PM IST

3:30 PM
సెన్సెక్స్​, నిఫ్టీ ఆల్​టైమ్​ హై
సోమవారం జోరుమీదున్న దేశీయ స్టాక్​ మార్కెట్​లు జీవితకాల గరిష్ఠాన్ని నమోదు చేశాయి. సెన్సెక్స్​ సూచీ 194.07 పాయింట్లు లాభపడి 82,559.84 పాయింట్ల వద్ద ఆల్​టైమ్​ హై రికార్డును నమోదు చేసింది. 42.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 25,278.70 పాయింట్ల వద్ద జీవితకాల గరిష్ఠం వద్ద ముగిసింది.

Stock Market Today September 2, 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్​, నిఫ్టీలు ఎర్లీ ట్రేడింగ్​లో జీవనకాల గరిష్ఠాలను తాకాయి. విదేశీ పెట్టుబడులు పెరగడం, యూఎస్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం వల్ల ఇండియన్​ మార్కెట్లు వరుసగా 13వ రోజు కూడా లాభాల్లో కొనసాగుతున్నాయి.

ప్రస్తుతం బొంబాయి స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 177 పాయింట్లు లాభాపడి 82,545 వద్ద కొనసాగుతోంది. జాతీయ స్టాక్​ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 51 పాయింట్లు పెరిగి 25,287 వద్ద ట్రేడవుతోంది.

  • లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్​ : బజాజ్​ ఫిన్​సెర్వ్​, ఐటీసీ, హెచ్​సీఎల్ టెక్​, ఏసియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్​, టీసీఎస్​, మారుతి సుజుకి, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్​, టాటా స్టీల్​
  • నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్​ : టాటా మోటార్స్​, ఎం అండ్ ఎం, ఎన్​టీపీసీ, టైటాన్​, భారతీ ఎయిర్​టెల్​, ఐసీఐసీఐ బ్యాంక్, ఎల్​ అండ్​ టీ, పవర్​గ్రిడ్​, టీసీఎస్​, ఎస్​బీఐ,

భవిష్యత్​లో మరిన్ని లాభాలు గ్యారెంటీ!

"నేను ఫండమెంటల్స్ గురించి చెబుతాను. దేశంలో స్థూల ఆర్థిక అంశాలు బలంగా ఉన్నాయి. ప్రభుత్వం కార్పొరేట్ రంగానికి చేదోడుగా నిలుస్తోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లోకి గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువగా పెట్టుబడులు వస్తున్నాయి. మ్యూచువల్ ఫండ్స్​లో సిప్​ విధానంలో భారీగా ఇన్వెస్ట్ చేస్తున్నారు. ప్రజలు దేశ ఆర్థిక వృద్ధిపై మంచి నమ్మకంతో ఉన్నారు. కనుక మున్ముందు స్టాక్ మార్కెట్ పెట్టుబడులు మరింత పెరిగే అవకాశం ఉంది. అందువల్ల స్టాక్ మార్కెట్ సూచీలు కొత్త గరిష్ఠ స్థాయిలకు చేరుకునే అవకాశం కచ్చితంగా ఉంటుంది. భవిష్యత్​లో క్యాపిటల్ మార్కెట్లో రాబడులు బాగానే ఉంటాయని చెప్పవచ్చు." - సునీల్ షా, స్టాక్ మార్కెట్ నిపుణులు

అంతర్జాతీయ మార్కెట్లు
టెస్లా, అమెజాన్‌ వంటి దిగ్గజ కంపెనీల షేర్లు రాణించటంతో యూఎస్​ స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం భారీ లాభాలతో ముగిశాయి. ప్రస్తుతం ఆసియా మార్కెట్లలో సియోల్​ లాభాల్లో ట్రేడవుతుండగా, టోక్యో, షాంఘై, హాంకాంగ్​ నష్టాల్లో కొనసాగుతున్నాయి.

విదేశీ పెట్టుబడులు
FIIs Investments : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత మదుపర్లు (FIIs) శుక్రవారం నికరంగా రూ.5,318 కోట్ల విలువైన ఈక్విటీ షేర్లను కొన్నారు. దేశీయ సంస్థాగత మదుపర్లు (DIIs) రూ.3,198 కోట్ల విలువైన స్టాక్స్​ విక్రయించారు.

రూపాయి విలువ
Rupee Open September 2, 2024 : అంతర్జాతీయ మార్కెట్​లో రూపాయి విలువ 1 పైసా తగ్గింది. ప్రస్తుతం అమెరికన్​ డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.83.86గా ఉంది.

ముడి చమురు ధర
Crude Oil Prices September 2, 2024 :అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు 0.82 శాతం మేర తగ్గాయి. దీనితో ప్రస్తుతం బ్యారెల్ బ్రెంట్​ క్రూడ్ ఆయిల్ ధర 76.30 డాలర్లకు చేరింది.

Last Updated : Sep 2, 2024, 3:58 PM IST

ABOUT THE AUTHOR

...view details