Stock Market Close Today 8th 2024 :దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ లాభాలతో ముగిశాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ 494 పాయింట్లు లాభపడి 74,742 వద్ద లైఫ్ టైమ్ హై రికార్డ్ వద్ద ముగిసింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ నిఫ్టీ 152 పాయింట్లు వృద్ధి చెంది 22,666 వద్ద జీవన కాల గరిష్ఠాలను టచ్ చేసి స్థిరపడింది.
- లాభపడిన స్టాక్స్ :మారుతి సుజుకి, ఎం అండ్ ఎం, ఎన్టీపీసీ, ఎల్ అండ్ టీ, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, టాటా స్టీల్, ఐటీసీ
- నష్టపోయిన షేర్స్ :నెస్లే ఇండియా, విప్రో, సన్‌ఫార్మా, హెచ్‌సీఎల్ టెక్, టైటాన్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఇన్ఫోసిస్, టీసీఎస్
Stock Market Today April 8th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలతో ప్రారంభమయ్యాయి. బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 307 పాయింట్లు లాభపడి 74,555 వద్ద జీవనకాల గరిష్ఠాలను తాకింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 22,623 వద్ద ఆల్-టైమ్ హై రికార్డ్‌ను క్రాస్ చేసింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు వస్తుండడం, విదేశీ పెట్టుబడులు పెరుగుతుండడం, ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా కొనసాగిస్తున్నట్లు ప్రకటించడమే ఇందుకు కారణం.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 382 పాయింట్లు లాభపడి 74,625 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 107 పాయింట్లు వృద్ధి చెంది 22,620 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగుతున్న స్టాక్స్ :పవర్‌గ్రిడ్, రిలయన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా స్టీల్, ఎన్టీపీసీ, మారుతి సుజుకి, ఇన్ఫోసిస్
- నష్టాల్లో ట్రేడవుతున్న షేర్స్ :విప్రో, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టాటా మోటార్స్, టైటాన్, నెస్లే ఇండియా, ఎస్బీఐ, బజాజ్ ఫైనాన్స్
విదేశీ పెట్టుబడులు
FIIs Investment : స్టాక్ ఎక్స్ఛేంజ్ డేటా ప్రకారం, విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు శుక్రవారం రూ.1659.27 కోట్ల విలువైన ఈక్విటీలు కొనుగోలు చేశారు.