Stock Market Close March 4th 2024 :సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు జీవనకాల గరిష్ఠాల వద్ద ముగిశాయి.
బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 66 పాయింట్లు లాభపడి 73,872 వద్ద ఆల్-టైమ్ హైరికార్డుతో స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ 27 పాయింట్లు వృద్ధి చెంది 22,405 ఆల్-టైమ్ హైలెవల్ను టచ్ చేసింది.
Stock Market Today March 4th 2024 : సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు మంచి లాభాలతో ప్రారంభమయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభంలోనే నిఫ్టీ జీవన కాల గరిష్ఠాలను తాకింది. ఓ దశలో నష్టాల్లోకి జారుకున్న స్టాక్ మార్కెట్లు మళ్లీ పుంజుకుని లాభాల బాట పట్టాయి. ఎనర్జీ, బ్యాంకింగ్ సెక్టార్స్ రాణిస్తుండడమే ఇందుకు కారణం. మూడో త్రైమాసికంలో ఇండియన్ జీడీపీ 8.4 శాతానికి చేరడం కూడా మదుపరుల సెంటిమెంట్‌ను బలపరుస్తోంది.
ప్రస్తుతం బొంబాయి స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ సెన్సెక్స్ 77 పాయింట్లు లాభపడి 73,884 వద్ద ట్రేడ్ అవుతోంది. జాతీయ స్టాక్ ఎక్స్ఛేంజి సూచీ నిఫ్టీ ప్రస్తుతం 62 పాయింట్లు వృద్ధి చెంది 22,401 వద్ద కొనసాగుతోంది.
- లాభాల్లో కొనసాగున్న షేర్లు : ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్, భారతీ ఎయిర్టెల్, ఇండస్ఇండ్ బ్యాంక్, సన్‌ఫార్మా, మారుతి సుజుకి, రిలయన్స్
- నష్టాల్లో కొనసాగుతున్న షేర్లు : జేఎస్‌డబ్ల్యూ స్టీల్, టాటా స్టీల్, టైటాన్, ఎం అండ్ ఎం, ఏసియన్ పెయింట్స్, హెచ్‌సీఎల్ టెక్, విప్రో
స్పెషల్ ట్రేడింగ్ సెషన్
శనివారం నిర్వహించిన స్పెషల్ ట్రేడింగ్ సెషన్లో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ లాభాలు మూటగట్టుకున్న విషయం తెలిసిందే.