Startup Business Loans In India : చాలా మంది భారతీయ యువతీ, యువకులు తమ సరికొత్త ఐడియాలతో బిజినెస్ స్టార్ట్ చేయాలని కలలు కంటూ ఉంటారు. మరికొందరు జీవనోపాధి కోసం సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు (MSME) నెలకొల్పాలని ఆశిస్తూ ఉంటారు. కానీ వాటిని ప్రారంభించడానికి సరిపడా డబ్బులు వారి దగ్గర ఉండవు. బ్యాంకులు, బ్యాంకింగేత ఆర్థిక సంస్థలు కూడా వీరికి అంత సులువుగా రుణాలు మంజూరు చేయవు.
అందుకే ఇలాంటి వారి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొన్ని పథకాలను ప్రవేశపెట్టాయి. వీటి ద్వారా స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఈలకు రుణాలు మంజూరు చేస్తున్నాయి. మరి మీరు కూడా ఇలాంటి పథకాల కోసం చూస్తున్నారా? మరెందుకు ఆలస్యం ఆ ప్రభుత్వ పథకాల గురించి వివరంగా తెలుసుకుందాం రండి.
Startup Business Loans 2024 :
1. SIDBI Loans : స్మాల్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్ఐడీబీఐ) అనేది స్టార్టప్‌లకు, ఎంఎస్ఎంఈలకు నేరుగా రుణాలు మంజూరు చేస్తుంది. బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్ల కంటే, ఇది వసూలు చేసే ఇంట్రెస్ట్ రేటు దాదాపు 300 బేసిస్ పాయింట్లు తక్కువగా ఉంటుంది.
2. Bank Credit Facilitation Scheme : నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ (ఎన్ఎస్ఐసీ) అనేది వివిధ బ్యాంకుల భాగస్వామ్యంతో పనిచేస్తుంది. ఇది సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ)కు బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయిస్తుంది. ఈ స్కీమ్ రీపేమెంట్ కాలవ్యవధి 5 సంవత్సరాల నుంచి 7 సంవత్సరాల వరకు ఉంటుంది. కొన్ని ప్రత్యేక సందర్భాల్లో ఈ రీపేమెంట్ వ్యవధిని 11 ఏళ్ల వరకు పొడిగిస్తారు కూడా.
3. PMMY :ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకాన్ని 2015లో ప్రారంభించారు. ఇది మైక్రో యూనిట్స్ డెవలప్మెంట్ అండ్ రీఫైనాన్స్ ఏజెన్సీ (ముద్రా) నేతృత్వంలో పని చేస్తుంది. ఈ స్కీమ్ ద్వారా అన్ని రకాల తయారీ (మాన్యుఫాక్చురింగ్), వాణిజ్యం (ట్రేడింగ్), సేవా (సర్వీస్) రంగాలకు చెందిన బిజినెస్‌లకు రుణాలు మంజూరు చేస్తారు. ఈ ప్రధానమంత్రి ముద్రా యోజన పథకం 3 కేటగిరీల కింద రుణాలు మంజూరు చేస్తుంది. అవి :
1. శిశు
2. కిశోర్
3. తరుణ్
ఈ ముద్రా పథకం కింద రూ.50,000 నుంచి రూ.10 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తారు. చేతివృత్తులవారు, దుకాణదారులు, కూరగాయలు అమ్మేవారు, మెషీన్ ఆపరేటర్లు, రిపైర్ షాపుల వాళ్లు కూడా ఈ ముద్రా లోన్స్ తీసుకోవచ్చు.
4. Credit Guarantee Scheme : తయారీ, సేవల రంగాల్లోని ఎంఎస్ఎంఈలు ఈ క్రెడిట్ గ్యారెంటీ స్కీమ్ (CGS) కింద రుణాలు తీసుకోవచ్చు. కొత్తగా బిజినెస్ మొదలుపెట్టాలనుకునేవాళ్లు, ఇప్పటికే ఎంఎస్ఎంఈలు నడుపుతున్నవాళ్లు కూడా ఈ రుణాలు పొందవచ్చు. కానీ వ్యవసాయం, రిటైల్ వ్యాపారం చేసేవారికి, స్వయం సహాయక బృందాలకు, విద్యా సంస్థలకు ఈ సీజీఎస్ స్కీమ్ కింద రుణాలు ఇవ్వరు.
క్రెడిట్ గ్యారెంటీ ఫండ్ ట్రస్ట్ నేతృత్వంలో ఈ పథకం అమలు అవుతోంది. ఈ స్కీమ్ కింద సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు రూ.2 కోట్ల వరకు రుణాలు పొందవచ్చు.
5. Standup India :2016 ఏప్రిల్‌లో SIDBI నేతృత్వంలో ఈ 'స్టాండ్‌అప్ ఇండియా' పథకాన్ని ప్రారంభించారు. మాన్యుఫ్యాక్చురింగ్, ట్రేడింగ్, సర్వీస్ రంగాల్లోని సంస్థలకు ఈ పథకం కింద రుణాలు మంజూరు చేస్తారు. ఈ స్టాండ్‌అప్ ఇండియా స్కీమ్ కింద రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి రూపాయల వరకు రుణాలు పొందవచ్చు. ఈ రుణాలు తీర్చడానికి ఏడేళ్ల వ్యవధి ఇస్తారు. గరిష్ఠ మారటోరియం పీరియడ్ 18 నెలలు ఉంటుంది.
6. Sustainable Finance Scheme : ఈ సస్టైనబుల్ ఫైనాన్స్ స్కీమ్‌ను కూడా SIDBI నేతృత్వంలోనే ప్రారంభించారు. టెక్నాలజీ హార్డ్‌వేర్, గ్రీన్ ఎనర్జీ, నాన్-రెన్యూవబుల్ ఎనర్జీ, పునరుత్పాదక ఇంధన పరిశ్రమలకు ఈ పథకం కింద లోన్స్ అందిస్తారు.
Startup Business Loans By Banks :మన దేశంలోని ప్రైవేట్ బ్యాంకులు కూడా స్టార్టప్‌లకు లోన్స్ అందిస్తున్నాయి. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
- హెచ్డీఎఫ్ బ్యాంక్ లోన్స్ : భారతదేశంలోని అతిపెద్ద ప్రైవేట్ రంగ బ్యాంక్ అయిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్ స్టార్టప్‌లకు రూ.40 లక్షల నుంచి రూ.50 లక్షల వరకు లోన్స్ అందిస్తోంది. అయితే లోన్స్ ఇచ్చేటప్పుడు 0.99 ప్రాసెసింగ్ ఫీజు వసూలు చేస్తుంది. 4 ఏళ్లలో ఈ రుణాన్ని తీర్చేయాల్సి ఉంటుంది.
- టాటా క్యాపిటల్ : స్టార్టప్‌లకు టాటా క్యాపిటల్ కూడా లోన్స్ ఇస్తూ ఉంటుంది. టాటా క్యాపిటల్ అనేది స్టార్టప్‌లకు రూ.50,000 నుంచి రూ.75 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. దీని రీపేమెంట్ టెన్యూర్ 3 ఏళ్లు.
- కోటక్ మహీంద్రా బ్యాంక్ :దేశంలో ప్రారంభించే స్టార్టప్‌లకు రూ.75 లక్షల వరకు రుణాలు మంజూరు చేస్తుంది. రీపేమెంట్ పీరియడ్ 5 ఏళ్లు.
బిజినెస్ లోన్‌కు అప్లై చేయాలంటే?
- లోన్ కోసం అప్లై చేసే ముందు, మీ బిజినెస్ ప్లాన్‌ను సిద్ధం చేసుకోవాలి.
- మీకు లోన్ ద్వారా వచ్చిన డబ్బును ఏయే పనులకు ఉపయోగిస్తారో ముందే కియర్గా చెప్పాలి.
- మీ బిజినెస్ లక్ష్యం ఏమిటి? ఎలా డబ్బులు సంపాదిస్తారు? అనే విషయాలు చెప్పాలి.
- బిజినెస్ గ్రోత్ కావడానికి ఉన్న అవకాశాలు గురించి కూడా చెప్పాల్సి ఉంటుంది.
- మీకు ఎంత రుణం (డబ్బు) కావాలో కూడా ముందే కచ్చితంగా చెప్పాల్సి ఉంటుంది.
కొత్తగా ఉద్యోగంలో చేరారా? ఈ తప్పులు అస్సలు చేయవద్దు!
రియల్ ఎస్టేట్‌లో ఇన్వెస్ట్ చేయాలా? ఈ టిప్స్ పాటిస్తే లాభాలు గ్యారెంటీ!