తెలంగాణ

telangana

ETV Bharat / business

ఫ్రీగా 'SBI ఉన్నతి' క్రెడిట్ కార్డ్- నాలుగేళ్ల వరకు నో ఫీజు- బోలెడు బెనిఫిట్స్ కూడా! - SBI CARD UNNATI

ఎటువంటి వార్షిక చార్జీలు లేకుండా ఉచితంగా క్రెడిట్ కార్డు- ఎస్​బీఐ కార్డ్ ఉన్నతి వివరాలు మీ కోసం

SBI Card Unnati Benefits
SBI Card Unnati Benefits (Getty Imahe)

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2025, 3:58 PM IST

SBI Card Unnati Benefits: క్రెడిట్‌ కార్డులను వాడాలంటే జాయినింగ్‌ ఫీజుతో పాటు వార్షిక రుసుములు ఉంటాయి. క్రెడిట్‌ కార్డు వాడినా వాడకపోయినా ఈ రుసుములు చెల్లించాల్సిందే. అయితే స్టేట్​​ బ్యాంక్ ఆఫ్​ ఇండియా(ఎస్​బీఐ) ఎటువంటి వార్షిక రుసుము లేకుండా క్రెడిట్ కార్డ్​ను అందిస్తోంది. అదే 'ఎస్​బీఐ కార్డ్ ఉన్నతి'.

ఈ ఎస్​బీఐ కార్డ్ ఉన్నతి ఆఫర్ కేవలం నాలుగేళ్లు మాత్రమే ఉంటుంది. క్రెడిట్​ కార్డు ఎటువంటి చార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదు. ఆ తర్వాత నుంచి మాత్రం చార్జీలు పడతాయి. ఐదో సంవత్సరం నుంచి ఆ ఉన్నతి కార్డు వార్షిక రుసుము రూ.499గా ఉంది. మొదటి నాలుగేళ్లు వరకు జాయినింగ్ ఫీజు, వార్షిక చార్జీలు లేకుండానే ఉచితంగా ఆ కార్డును వినియోగించుకోవచ్చు. ఆ కార్డ్​పై వివిధ రకాల రివార్డ్ పాయింట్స్​, మైల్​స్టోన్ రివార్డ్స్, ఫ్యూయల్ సర్​ఛార్జ్ మినహయింపు వంటి ఫీచర్స్​ను అందిస్తుంది.

ఎస్​బీఐ కార్డ్ ఉన్నతి ఫీచర్లు
రివార్డ్ పాయింట్‌లు: రూ.100 ఖర్చు చేస్తే ఒక రివార్డ్ పాయింట్​ను అందిస్తోంది. అయితే ఈ క్రెడిట్ కార్డుపై క్యాష్ అడ్వాన్స్, బ్యాలెన్స్ ట్రాన్స్‌ఫర్, ఎన్‌క్యాష్, ఫ్లెక్సీ పే, ఫ్యూయల్ ట్రాన్స్​క్షన్స్ లాంటి వాటికి రివార్డ్ పాయింట్స్ ఉండవు.

మైల్​స్టోన్ రివార్డ్స్ : వార్షిక ఖర్చులను రూ.50 వేలు అంతకంటే ఎక్కువ చేస్తే 15 రోజుల లోపు రూ.500 క్యాష్​బ్యాక్​ లభిస్తుంది.

ఫ్యూయల్ సర్‌ఛార్జ్: కార్డ్ హోల్డర్స్ రూ.500 నుంచి రూ.3 వేల వరకు చేసే ప్రతి ఇంధన కొనుగోళ్లపై 1 శాతం మినహాయంపు ఇస్తోంది.

ఫిక్స్‌డ్ డిపాజిట్: ఎస్​బీఐ రూ.25,000 లేదా అంతకంటే ఎక్కువ ఫిక్స్​డ్​ డిపాజిట్ ఉన్న వారు ఈ కార్డ్​ను పొందవచ్చు.

ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగించుకోవచ్చు : ఇండియాలోని 3,25,000, ప్రపంచవ్యాప్తంగా 24 మిలియన్లకు పైగా అవుట్‌లెట్స్​లో ఈ కార్డ్‌ని ఉపయోగించవచ్చు. వీసా లేదా మాస్టర్ కార్డ్‌ని ఆమోదించే ఏ అవుట్‌లెట్‌లోనైనా ఈ కార్డ్​ను వినియోగించుకోవచ్చు.

యాడ్-ఆన్ కార్డ్స్:ఈ క్రెడిట్ కార్డుపై మీ కుటుంబ సభ్యులకు యాడ్​ ఆన్ కార్డ్ సదుపాయం అందుబాటులో ఉంది.

ఈఎంఐ చెల్లింపులు : మీ మొత్తం ఖర్చులను ఈఎంఐలుగా మార్చుకోవచ్చు. దీని ద్వారా డబ్బును ఆదా చేసుకోవచ్చు.

ఫ్లెక్సీపే:మీ బిల్లును నెలవారీ వాయిదాల్లో మార్చుకోవచ్చు. ఆ కార్డును ఉపయోగించి రూ.2,500 లేదా అంతకంటే ఎక్కువ ధరకు ఏదైనా వస్తువును కొనుగోలు చేస్తే, 30 రోజులలోపు దాన్ని ప్లెక్సీ పే ద్వారా మార్చుకోవచ్చు.

UPI అకౌంట్‌కు క్రెడిట్ కార్డ్ లింక్‌ చేసుకోవాలా? స్టెప్‌ బై స్టెప్‌ ప్రాసెస్‌ ఇదిగో!

ఫ్యామిలీ కోసం ఫ్లోటర్ క్రెడిట్ కార్డ్ - బెస్ట్ బెనిఫిట్స్ ఇవే!

ABOUT THE AUTHOR

...view details