RBI Bars Kotak Mahindra Bank :రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా కోటక్ మహీంద్రా బ్యాంకుపై ఆంక్షలు విధించింది. కోటక్ మహీంద్రా బ్యాంకు కొత్త క్రెడిట్ కార్డులు జారీ చేయకుండా నిషేధం విధించింది. అలాగే ఆన్‌లైన్, మొబైల్ బ్యాంకింగ్ విధానాల ద్వారా కూడా కొత్త అకౌంట్లను జారీ చేయవద్దని ఆదేశించింది. తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వస్తాయని పేర్కొంది. అయితే కోటక్ బ్యాంక్ ఇప్పటికే ఉన్న క్రెడిట్ కార్డ్ వినియోగదారులకు, పాత కస్టమర్లకు సేవలను అందించుకోవచ్చని ఆర్‌బీఐ తెలిపింది. 2022, 2023 ఏడాదికి సంబంధించి కోటక్ మహీంద్రా బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్‌లో లోపాలు గుర్తించిన ఆర్‌బీఐ ఈ కఠిన చర్యలు తీసుకుంది.
ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్ లోపాలు
"ఐటీ ఇన్వెంటరీ మేనేజ్మెంట్, ప్యాచ్ అండ్ ఛేంజ్ మేనేజ్మెంట్, యూజర్ యాక్సెస్ మేనేజ్మెంట్, వెండర్ రిస్క్ మేనేజ్మెంట్, డేటా సెక్యూరిటీ, డేటా లీక్ ప్రివెన్షన్ స్ట్రాటజీ, బిజినెస్ కంటిన్యూటీ, డిజాస్టర్ రికవరీ రిగర్ అండ్ డ్రిల్ మొదలైన అంశాలలో కోటక్ మహీంద్రా బ్యాంకు లోపాలు బయటపడ్డాయి. ముఖ్యంగా కోటక్ మహీంద్రా బ్యాంకు ఐటీ రిస్క్ మేనేజ్మెంట్, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ గవర్నెన్స్‌లో లోపాలు ఉన్నాయి" అని ఆర్ బీఐ ప్రకటన విడుదల చేసింది.