Post Office PPF Scheme Benefits: ప్రస్తుత కాలంలో పెరిగిన ఖర్చుల దృష్ట్యా ప్రతి ఒక్కరు పొదుపు మంత్రాన్ని పాటిస్తున్నారు. తమ భవిష్యత్తు అవసరాల కోసం డబ్బును పొదుపు చేయాలనుకుంటున్నారు. ఇందుకోసం ఏ స్కీమ్స్ మంచిది, ఎక్కడ పెడితే రిస్క్ ఉండదు అనే వివరాలను తెలుసుకుంటున్నారు. అయితే ఇలాంటి వారి కోసం భారతీయ తపాలా శాఖ ఓ స్కీమ్‌ను తీసుకొచ్చింది. నిజానికి ఇది ఎప్పటి నుంచో ఉన్న పథకమే. కాకపోతే దీని గురించి ఎక్కువ మందికి అవగాహన లేదు. ఇంతకీ ఆ పథకం ఏంటి అనుకుంటున్నారా..? అదే పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(PPF) పథకం. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో చూద్దాం..
కాంపౌండ్ ఎఫెక్ట్:ఈ పీపీఎఫ్ స్కీమ్ కాల వ్యవధి 15 సంవత్సరాలు. ఒక సంవత్సరంలో కనిష్ఠంగా రూ.500 నుంచి రూ.1లక్షా 50వేల వరకు జమ చేయవచ్చు. ఆ తరువాత కూడా ఈ స్కీమ్‌ను మరో 5 సంవత్సరాలకు పొడిగించుకోవచ్చు.ఈ విధంగా 5 సంవత్సరాల బ్లాక్ పీరియడ్‌తో ఎన్నిసార్లు అయినా ఈ స్కీమ్‌ను పొడిగించుకోవడానికి అవకాశం ఉంటుంది.
ఉదాహరణకు.. మీరు రోజుకు రూ.417 పొదుపు చేసి ఈ పథకంలో పెట్టుబడి పెట్టారనుకుందాం. అంటే నెలకు 12వేల 500 మీరు కట్టాలి. ఇలా 15 సంవత్సరాల పాటు కడితే మీ పెట్టుబడి మొత్తం రూ.22లక్షల 50వేలు అవుతుంది. ప్రస్తుత వడ్డీ రేటు ప్రకారం మీకు దాదాపు రూ.40లక్షల 68వేలు అందుతుంది. ఒకవేళ మీరు ఈ డబ్బులు తీసుకోకుండా మరో 5 సంవత్సరాల పాటు ఆ స్కీమ్‌లోనే కొనసాగితే.. అప్పుడు మీరు పెట్టుబడి పెట్టిన మొత్తం నెలకు 12వేల 500 చొప్పున 20 సంవత్సరాలకు రూ.30 లక్షలు అవుతుంది. వడ్డీతో కలిపి మీకు వచ్చే రిటర్న్ రూ.66లక్షల 58వేల వరకు ఉంటుంది. ఇప్పుడు కూడా మీరు డబ్బులు తీసుకోకుండా మరో 5 ఏళ్లు పొడిగిస్తే నెలకు 12వేల 500 చొప్పున 25 సంవత్సరాలకు రూ.37లక్షల 50వేలు పెట్టుబడి పెట్టాలి. మీకు వడ్డీతో కలిపి వచ్చే రాబడి సుమారు కోటి రూపాయల వరకు ఉంటుంది. అంటే ఇక్కడ కాంపౌండింగ్ ఎఫెక్ట్ పని చేసింది. ఈ విధంగా మీరు చిన్న మొత్తాల్లో పొదుపు చేసి, అధిక స్థాయిలో రాబడులను సంపాదించవచ్చు.
వడ్డీ లేకుండానే మహిళలకు రూ.5 లక్షల రుణం - ఎలా అప్లై చేసుకోవాలో తెలుసా? - Lakhpati Didi Scheme