Netflix Plans In India : ఒకప్పుడు సినిమా చూడాలంటే కచ్చితంగా థియేటర్‌కు వెళ్లాల్సివచ్చేది. టీవీలు వచ్చిన తర్వాత ఇంట్లోనే కూర్చుని వాటిని హాయిగా చూసేవాళ్లం. తర్వాతి కాలంలో ఫోన్లు వచ్చాయి. ముఖ్యంగా స్మార్ట్ఫోన్ల ఎంట్రీతో టీవీ అవసరం కూడా లేకుండా పోయింది. తాజాగా ఇప్పుడు ఓటీటీల ట్రెండ్ నడుస్తోంది. మన దేశంలోనూ పలు ప్రఖ్యాత ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అందులో నెట్‌ఫ్లిక్స్ కూడా ఒకటి.
నెట్‌ఫ్లిక్స్ అనేది ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఓటీటీ ప్లాట్‌ఫామ్. సినిమా, సీరియల్స్ దగ్గర్నుంచి వెబ్ సిరీస్‌లు, కామెడీ, స్పోర్స్ట్ వరకు అన్నీ అందులోనే దొరుకుతాయి. మన దేశంలోనూ నెట్‌ఫ్లిక్స్‌ను చాలా మంది వాడుతుంటారు. కానీ వీటి సేవల్ని వినియోగించుకోవాలంటే కచ్చితంగా సబ్‌స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. ఒక్కసారి తీసుకున్నాక టీవీ, కంప్యూటర్, మొబైల్‌ల్లో మీకు నచ్చిన వీడియో కంటెంట్‌ను చూడవచ్చు. అందుకే వాటి గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.
Netflix Subscription Plans
నెట్‌ఫ్లిక్స్ 4 రకాల సబ్‌స్క్రిప్షన్ ప్లాన్లను అందిస్తోంది. వీడియో రిజల్యుషన్ బట్టి వీటి ధర ఆధారపడి ఉంటుంది.
- Netflix 149 Plan :నెట్‌ఫ్లిక్స్ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ధర కేవలం రూ.149తో ప్రారంభమవుతుంది. ఇది మొబైల్ వెర్షన్. రిజల్యుషన్ 480p ఉంటుంది. వీడియో, ఆడియో క్వాలిటీ ఫరవాలేదు. ఈ వెర్షన్ మొబైల్ ఫోన్, టాబ్లెట్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒకసారి ఒక డివైజ్‌లో మాత్రమే దీనిని వినియోగించుకోవడానికి వీలవుతుంది.
- Netflix 199 Plan :నెట్‌ఫ్లిక్స్ బేసిక్ వెర్షన్ నెలవారీ ధర రూ.199. వీడియా, ఆడియో క్వాలిటీ బాగుంటుంది. 720p (HD) వీడియోలు దీనిలో చూడవచ్చు. ఈ ప్లాన్ తీసుకుంటే టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్స్‌లో వీటి సేవల్ని వినియోగించుకోవచ్చు. మైనస్ పాయింట్ ఏంటంటే, మీరు ఒకసారికి ఒక డివైజ్‌లో మాత్రమే దీనిని ఉపయోగించుకునే అవకాశముంది.
- Netflix 499 Plan :స్టాండర్డ్ వెర్షన్ విషయానికి వస్తే, దీని నెల వారీ సబ్‌స్క్రిప్షన్ రూ.499గా ఉంది. 1080p రిజల్యుషన్‌తో Full HDలో వీడియోలు వీక్షించవచ్చు. ఆడియో, వీడియో క్వాలిటీ చాలా బాగుంటుంది. ఈ వెర్షన్ టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్స్‌కు సపోర్ట్ చేస్తుంది. ఒకేసారి రెండు డివైజ్ ల్లో లాగిన్ చేసుకుని వాడుకోవడం ఈ వెర్షన్ ప్లస్ పాయింట్.
- Netflix 649 Plan :నెట్‌ఫ్లిక్స్ ప్రీమియం వెర్షన్ ధర రూ.649. ఇందులోని కంటెంట్‌ను 4K రిజల్యూషన్‌తో Ultra HD + HDR క్వాలిటీతో ఎంజాయ్ చేయవచ్చు. ఈ వెర్షన్‌తో స్పేషియల్ ఆడియో ఫీచర్ వస్తుంది. వీడియో క్వాలిటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టీవీ, కంప్యూటర్, మొబైల్ ఫోన్, టాబ్లెట్స్‌లో దీనిని వాడుకోవచ్చు. ఈ ప్లాన్ తీసుకుంటే ఏకకాలంలో 4 డివైజ్‌ల్లో లాగిన్ అయ్యి, వీటి సేవల్ని వినియోగించుకోవచ్చు.
IPL లవర్స్‌కు జియో బంపర్ ఆఫర్ - రూ.49కే 25జీబీ డేటా! - Rs 49 Jio Cricket Plan
గూగుల్‌లో ఉన్న మీ పర్సనల్ డేటాను డిలీట్ చేయాలా? ఈ సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వండి! - How To Delete My Activity In Google