Most Powerful Bikes Under Rs 3 Lakh :నేటి యువతకు బైక్స్ అంటే ఎంత క్రేజో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చాలా మంది కుర్రాళ్లు తమకు నచ్చిన బైక్‌ను సొంతం చేసుకునేందుకు ఎంత ఖర్చు అయినా పెట్టడానికి వెనుకాడడం లేదు. అందుకే ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు అన్నీ మంచి ఫీచర్స్, స్పెక్స్‌తో, ఆకట్టుకునే డిజైన్‌తో, సూపర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్‌లను రూపొందిస్తున్నాయి. వాటిలో రూ.3 లక్షల బడ్జెట్లోని టాప్-5 బైక్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
5. Honda CB300R Features : ఈ హోండా సీబీ300ఆర్ బైక్‌లో 286.01 సీసీ సామర్థ్యం కలిగిన లిక్విడ్-కూల్డ్ బీఎస్-6 ఇంజిన్ ఉంటుంది. ఇది 9000 rpm వద్ద 31.13 PS పవర్, 7500 rpm వద్ద 27.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. దీనిలో 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ ఉంటుంది. దీని ఫ్యూయెల్ కెపాసిటీ 9.7 లీటర్లు. ఈ బైక్ ఒక లీటర్ పెట్రోల్‌కు 30 కి.మీ మైలేజ్ ఇస్తుంది. ఇది మల్టిప్లేట్ వెట్ క్లచ్ కలిగి ఉంటుంది. బండి ముందు, వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. తక్కువ ధరలో మంచి స్పోర్ట్స్ బాడీ బైక్ కొనాలని అనుకునేవారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
Honda CB300R Price : మార్కెట్లో ఈ హోండా సీబీ300ఆర్ బైక్ ధర సుమారుగా రూ.2.40 లక్షలు ఉంటుంది.
4. TVS Apache RTR 310 Features : ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 బైక్‌లో 312.12 సీసీ సామర్థ్యం గల సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్ ఉంది. ఇది 9700 rpm వద్ద 35.6 PS పవర్, 6650 rpm వద్ద 28.7 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. ఈ బైక్ 35 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇది వెట్ మల్టిప్లేట్ -7 ప్లేట్ డిజైన్, ఆర్టీ స్లిప్పర్ క్లచ్‌తో వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే స్పోర్ట్స్ నేకెడ్ బైక్ కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఛాయిస్ అవుతుంది.
TVS Apache RTR 310 Price : మార్కెట్లో ఈ టీవీఎస్ అపాచీ ఆర్టీఆర్ 310 బైక్ ధర సుమారుగా రూ.2.43 లక్షలు ఉంటుంది.
3. Triumph Scrambler 400 X Features : ఈ ట్రయంఫ్ స్క్రాంబ్లర్ 400 ఎక్స్ బైక్‌లో 398.15 సీసీ లిక్విడ్ కూల్డ్ సింగిల్ సిలిండర్ ఇంజిన్ ఉంది. ఇది 8000 rpm వద్ద 40 PS పవర్, 6500 rpm వద్ద 37.5 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. ఇది 6 స్పీడ్ గేర్ బాక్స్ కలిగి ఉంటుంది. దీని ఫ్యూయెల్ కెపాసిటీ 13 లీటర్లు. ఈ బైక్ 28.3 kmpl మైలేజ్ ఇస్తుంది. ఈ బైక్ ముందు వెనుక భాగాల్లో డిస్క్ బ్రేక్‌లు ఉంటాయి. ఇది వెట్ మల్టిప్లేట్ స్లిప్ క్లచ్‌తో వస్తుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే క్రూయిజర్ బాడీ బైక్ కొనాలని ఆశించే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.