Mileage Hacks Tips For Cars :కారు మైలేజీ పెరగాలంటే దాన్ని సరిగ్గా, సమర్థంగా నిర్వహించాలి. అందుకోసం ఏమేం చేయాలనే దానిపై వాహనదారుడు ఒక స్పష్టమైన అవగాహనకు రావాలి. రెగ్యులర్‌గా ఆయిల్‌ను మార్చుకొని ఇంజిన్‌ను కండీషన్‌లో ఉంచుకోవాలి. ఎయిర్ ఫిల్టర్లను ఎప్పటికప్పుడు రీప్లేస్ చేయించుకోవాలి. వీటితో పాటు ఇంకొన్ని టిప్స్‌ను ఆచరణలో పెడితే తప్పకుండా కారుకు మంచి మైలేజీ లభిస్తుంది. ఇంతకీ అవేంటో ఈ కథనంలో తెలుసుకుందాం.
కారు మైలేేజీ పెంచుకునే టిప్స్ ఇవీ
క్రూయిజ్ కంట్రోల్ : కారులో క్రూయిజ్ కంట్రోల్ మోడ్ ఉంటుంది. కారు వేగం నిలకడగా ఉండటానికి దీన్ని వినియోగించాలి. ప్రత్యేకించి హైవేలపై జర్నీ చేసేటప్పుడు ఇది పనికొస్తుంది. కారు ఈ మోడ్‌లో ఉన్నప్పుడు యాక్సిలరేటర్ పెడల్‌పై నుంచి పాదాన్ని తీసి, డ్రైవర్ కారును నడపొచ్చు. ఈ మోడ్‌లో డ్రైవింగ్ చేసే క్రమంలో ఇంధన వినియోగం తక్కువగా ఉంటుంది.
అతిగా ఇడ్లింగ్ వద్దు :కారు రెస్టింగ్ మోడ్‌లో ఉన్నప్పుడు ఇంజిన్‌ను ఆన్ చేసి ఉంచకూడదు. పార్కింగ్ కోసం, లేదా చేశాక కారు ఇంజిన్‌ను ఆఫ్ చేసి ఉంచితే ఇంధన వినియోగం తగ్గిపోతుంది. ఒకవేళ ఇలాంటప్పుడు ఇంజిన్‌ను ఆన్ చేసి వదిలేస్తే, ఇంజిన్‌ను రీస్టార్ట్ చేసేటప్పుడు వినియోగమయ్యే ఇంధనం కంటే ఎక్కువే ఖర్చవుతుంది. ఫలితంగా మైలేజీ తగ్గుతుంది.
అనవసర బరువు వద్దు :కారులో ఉన్న అనవసర వస్తువులు, పరికరాలను తీసేయండి. దీనివల్ల వాహనం బరువు తగ్గుతుంది. ఫలితంగా మైలేజీ, వేగం పెరుగుతాయి.