How To Complaint About Online Fraud :మీకు తెలియకుండా అనధికారిక యూపీఐ ట్రాన్సాక్షన్స్ జరిగినప్పుడు; క్రెడిట్/ డెబిట్ కార్డ్, ఏటీఎం స్కామ్స్‌కు గురైనప్పుడు వీలైనంత త్వరగా యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మీ డబ్బులు మీ చేతికి తిరిగి వస్తాయి. అది ఎలాగంటే?
సైబర్ నేరగాళ్లు టెక్నాలజీతో పాటు, మనుష్యుల సైకాలజీని కూడా వాడుకుంటూ నేరాలకు పాల్పడుతున్నారు. ముఖ్యంగా మనుషులను నమ్మించి, లేదా అర్జెంట్‌గా చేయాల్సి ఉంటుందని భయపెట్టి మోసాలు చేస్తున్నారు. బ్యాంకు అధికారులమని నమ్మించి, యూజర్ల డేటాను, తరువాత వారి అకౌంట్లోని డబ్బులను తస్కరిస్తున్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
UPI Scams
- ఉదాహరణకు యూపీఐ స్కామ్స్ ఎలా చేస్తారంటే? సైబర్ మోసగాళ్లు ముందుగా ఒక అన్-నోన్ నంబర్ నుంచి కష్టాల్లో ఉన్నామని, కనుక డబ్బులు పంపించమని ప్రాధేయపడుతూ మెసేజ్ చేస్తారు. లేదా సర్వీస్ ప్రొవైడర్లమని చెబుతూ, మీ వ్యక్తిగత వివరాలు, పిన్ నంబర్లు అడుగుతారు. మీరు అర్జెంట్‌గా యూపీఐ వివరాలు అప్డేట్ చేసుకోవాలని నమ్మిస్తారు. కనీసం మీరు ఆలోచించుకునే టైమ్ కూడా ఇవ్వరు.
- క్రెడిట్/ డెబిట్ కార్డ్ స్కామ్స్ ఎలా చేస్తారంటే? తాము బ్యాంకు అధికారులమని మిమ్మల్ని నమ్మిస్తారు. మీ బ్యాంక్ అకౌంట్‌కు సంబంధించిన ఓ సమస్య వచ్చిందని, వెంటనే దానిని పరిష్కరించాల్సిన అవసరం ఉంటుందని చెబుతారు. మీ మీద చాలా ప్రెజర్ పెడతారు. మీ క్రెడిట్/ డెబిట్ కార్డ్ వివరాలు, పిన్ నంబర్ అడుగుతారు.
- ఏటీఎం స్కామ్స్ కూడా ఇలానే చేస్తుంటారు. ఫోన్ చేసి మీ వివరాలు తెలుసుకుంటారు. అంతేకాదు ఈ ఫ్రాడ్స్టర్స్ ఏటీఎంల్లో స్కామర్లు లేదా క్యాష్ ట్రాపింగ్ డివైజ్‌లు ఇన్స్టాల్ చేస్తారు. వీటి ద్వారా యూజర్లు కార్డు వివరాలు తెలుసుకుంటారు. సీక్రెట్ కెమెరాలు వాడి పిన్ నంబర్లు తెలుసుకుంటారు.
వీలైనంత త్వరగా రిపోర్ట్ చేయాలి!
- ఇలాంటి ఆన్లైన్ మోసాలను అరికట్టాలంటే, ప్రతి ఒక్కరూ చాలా అప్రమత్తంగా ఉండాలి. బ్యాంక్ అధికారులు మీకు వచ్చే ఓటీపీలను, మీ క్రెడిట్, డెబిట్ కార్డ్ పిన్ నంబర్లను, పాస్‌వర్డ్‌లను అడగరని గుర్తుంచుకోండి. సైబర్ నేరగాళ్లు మిమ్మల్ని కనీసం ఆలోచించుకోనివ్వరు. త్వరగా వివరాలు అన్నీ చెప్పేయమని తొందర పెడుతుంటారు. కానీ మీరు మాత్రం ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయాలి. భయపడవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి.
- ఒకవేళ ఆన్లైన్ ఫ్రాడ్స్టర్స్ మిమ్మల్ని మోసం చేస్తే, వెంటనే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ బ్యాంక్‌కు లేదా ఫైనాన్సియల్ సర్వీస్ ప్రొవైడర్‌కు ఫోన్ చేసి, మీ అకౌంట్‌ను, క్రెడిట్/ డెబిట్ కార్డులను బ్లాక్ చేయమని చెప్పాలి. అప్పుడే మీ డబ్బులు సేఫ్‌గా ఉంటాయి. అలాకాకుండా మీరు బాగా ఆలస్యం చేస్తే, మీ డబ్బులు పూర్తిగా పోయే ప్రమాదం ఉంటుంది.
- బ్యాంకు వాళ్లకు చెప్పి, మీ అకౌంట్లను బ్లాక్ చేసిన తరువాత, నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్‌లోకి వెళ్లి కంప్లైంట్ ఫైల్ చేయాలి. లేదా హెల్లైన్ నంబర్- 1930కు ఫోన్ చేసి, ఫిర్యాదు చేయాలి. దీని వల్ల వెంటనే ఇన్వెస్ట్‌గేషన్ ప్రారంభించడానికి, న్యాయపరమైన ప్రొసీడింగ్స్ ఫాలో కావడానికి వీలవుతుంది.