LIC New Jeevan Anand Policy Details:ప్రస్తుతం లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం ప్రతి ఒక్కరి జీవితంలో ముఖ్యమైన విషయం. ఎందుకంటే మనల్ని నమ్ముకున్న వారికి, మన తర్వాత కూడా ఎలాంటి ఆర్థిక లోటు ఉండకూడదంటే లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీని తీసుకోవడం తప్పనిసరి. ఇప్పటికే ఎల్ఐసీ అనేక రకాల పాలసీలను అందిస్తోంది. ఈ క్రమంలోనే అధిక భద్రత, గణనీయమైన లాభాలకు హామీ ఇచ్చే మరొక పాలసీని తీసుకొచ్చింది. అదే 'ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ' (915). ఈ పాలసీ రోజువారీ పొదుపుతో గణనీయమైన ఫండ్‌ను నిర్మించడంలో పాలసీదారులకు సాయపడుతుంది. రోజుకు కనీసం రూ.200 పొదుపు చేస్తే మెచ్యూరిటీ సమయంలో ఏకంగా రూ.1.22 కోట్లు వస్తాయి. మరెందుకు ఆలస్యం ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్ పాలసీ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి.
ఎల్ఐసీ న్యూ జీవన్ ఆనంద్
గణనీయమైన రాబడిని అందించే తక్కువ ప్రీమియం ఉన్న ఎల్ఐసీ పాలసీల్లో న్యూ జీవన్ అనంద్ ఒకటి. ఈ ప్లాన్ ఆర్థిక భద్రతకు భరోసాను ఇస్తుంది. అంతేగాక అనేక మెచ్యూరిటీ ప్రయోజనాలను అందిస్తుంది. ప్రతి నెలా రూ.6,075 రూపాయలు పెట్టుబడి పెట్టి, 35 ఏళ్ల మెచ్యూరిటీ టర్మ్ తర్వాత దాదాపు రూ.1.22 కోట్లు మొత్తాన్ని పొందొచ్చు.
ప్రీమియం చెల్లింపు:
మొదటి ఏడాది ప్రీమియం(జీఎస్టీ 4.5 శాతం)
- ఏడాదికి : రూ.71,274
- ఆరు నెలలకు : రూ.36,041
- మూడు నెలలకు : రూ.18,223
- నెలకు : రూ.6,075
రెండో ఏడాది నుంచి ప్రీమియం (జీఎస్టీ 2.25 శాతం)
- ఏడాదికి : రూ.69,740
- ఆరు నెలలకు : రూ.35,265
- మూడు నెలలకు : రూ.17,830
- నెలకు : రూ.5,944