Home Loan At Fixed Interest Rate : సొంతిల్లు అనేది చాలా మందికి ఉండే ఒక గొప్ప కల. అందుకే ఇల్లు కొనుగోలు చేయాలని నిర్ణయించుకున్న తర్వాత, చాలా మంది బ్యాంకుల నుంచి లోన్ తీసుకోవడానికి మొగ్గు చూపుతుంటారు. లోన్ ఇచ్చే సమయంలో బ్యాంకులు రెండు రకాల ఇంట్రస్ట్ రేటు ఆప్షన్స్ ఇస్తాయి. అవి: స్థిర వడ్డీ రేటు, ఫ్లోటింగ్ వడ్డీ రేటు. ఈ ఆర్టికల్‌లో మనం స్థిర వడ్డీ రేటు ఎంచుకోవడం వల్ల కలిగే లాభ, నష్టాల గురించి తెలుసుకుందాం.
తక్కువ వడ్డీకి రుణం
మంచి క్రెడిట్ స్కోర్, స్థిరమైన ఆదాయం కలిగి ఉండి, గతంలో చెల్లింపులు సక్రమంగా చేసి ఉంటే, బ్యాంకులు తక్కువ (స్థిర) వడ్డీ రేటుకు లోన్ అందించే అవకాశం ఉంటుంది.
లాభాలు
స్థిర వడ్డీ రేటుతో హోమ్ లోన్ తీసుకుంటే, రుణ కాలవ్యవధిలో ఈఎంఐ మారకుండా ఒకే విధంగా ఉంటుంది. కనుక భవిష్యత్ ఈఎంఐలను ముందుగానే సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు. విలువ స్థిరంగా ఉన్నందు వల్ల నెలవారీ బడ్జెట్‌ను చక్కగా వేసుకోవచ్చు. ద్రవ్యోల్బణం, ఆర్థిక మాంద్యం లాంటి పరిస్థితులతో సంబంధం లేకుండా మీ ఇంటి రుణ వడ్డీ అలాగే ఉంటుంది. కాబట్టి వడ్డీ రేటును తరచూ పర్యవేక్షించాల్సిన అవసరం ఉండదు. కనుక ఈఎంఐ పేమెంట్స్‌ను ఆటోమేట్ చేయొచ్చు.