JioCinema 299 Premium Annual Plan : ఓటీటీ లవర్స్‌కు గుడ్ న్యూస్. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ జియో ఓటీటీ లవర్స్ కోసం ఓ సరికొత్త ప్రీమియం యాన్యువల్ సబ్స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. గతంలో రూ.999 ప్రైస్‌తో అందించిన యాన్యువల్ ప్లాన్ మాదిరి బెనిఫిట్సే ఈ నయా ప్లాన్‌లోనూ ఉంటాయి.
JioCinema 299 Plan Benefits
ఈ ప్లాన్ ద్వారా యాడ్ ఫ్రీ ప్రీమియం కంటెంట్‌ను ఆస్వాదించవచ్చు. స్పోర్ట్స్, లైవ్ ప్రోగ్రామ్‌ల్లో మాత్రం ప్రకటనలు వస్తాయి. ఈ ప్లాన్ సబ్‌స్క్రైబ్ చేసుకున్నవారు ఒక డివైజ్‌లో 4కె రిజల్యూషన్‌లో వీడియోలు చూడవచ్చు. ప్రస్తుతం ఈ ప్లాన్‌ను ప్రత్యేక తగ్గింపు ధరతో అందిస్తున్నారు. త్వరలో దీని ధరను రూ.599కు పెంచే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ అది రూ.999 కంటే తక్కువగానే ఉండనుంది.
జియో సినిమా వెబ్సైట్ ప్రకారం, ఈ రూ.299 ప్రీమియం ప్లాన్ తీసుకున్నవారు, తమకు నచ్చిన ప్రీమియం కంటెంట్‌ను డౌన్లోడ్ చేసుకుని, వీలునప్పుడు చూసుకోవచ్చు. ప్రస్తుతం జియో సినిమా ప్రీమియంలో హెచ్‌బీఓ, పీకాక్, వార్నర్స్ బ్రదర్స్, పారమౌంట్లకు చెందిన ప్రీమియం సినిమాలు, వెబ్‌సిరీస్‌లు అందుబాటులో ఉంటాయి.
స్పోర్ట్స్, లైవ్ ప్రోగ్రామ్‌ల పరిస్థితి ఏమిటి?
ఈ రూ.299 ప్రీమియం ప్లాన్ తీసుకున్నవారు స్పోర్ట్స్, లైవ్ ప్రోగ్రామ్‌లు ఆస్వాదించవచ్చు. కానీ అందులో ప్రకటనలు వస్తూనే ఉంటాయి. ఒకవేళ మీరు ఇంత డబ్బులు పెట్టలేకపోతే, రూ.29లకే నెలవారీ సబ్స్క్రిప్షన్ ప్లాన్ తీసుకోవచ్చు. దీనిని రెన్యువల్ చేసుకున్నప్పుడు మాత్రం రూ.59లు చెల్లించాల్సి ఉంటుంది. దీనికి బదులుగా రూ.299 చెల్లించి యాన్యువల్ ప్రీమియం ప్లాన్ తీసుకోవడమే బెటర్.
ఫ్యామిలీ మొత్తం చూడవచ్చు!
JioCinema Family Plan :జియోసినిమాలో ఒక మంత్లీ ఫ్యామిలీ ప్లాన్ కూడా ఉంది. దీని ధర కేవలం రూ.89 మాత్రమే. ఈ ప్లాన్ తీసుకున్నవాళ్లు ఒకేసారి 4 డివైజ్‌ల్లో ప్రీమియం కంటెంట్‌ను చూడవచ్చు. ప్రస్తుతానికి నెట్‌ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, డిస్నీ+హాట్ స్టార్లు అందిస్తున్న ప్లాన్స్ కంటే, జియోసినిమా ప్రైమ్ అందించే ప్లాన్స్ చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి.
లార్జ్ క్యాప్ Vs మిడ్ క్యాప్ Vs స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ - వీటిలో ఏది బెస్ట్ ఆప్షన్! - Different Mutual Funds
ఆ మాయమాటలు నమ్మారో - మీ బ్యాంక్ ఖాతా ఖాళీ కావడం గ్యారెంటీ! - How To Protect From Bank Fraud