Money Investment Tips In Telugu :సాధారణంగా డబ్బును సంపాదించగానే సరిపోదు. వచ్చిన డబ్బులను ఒక క్రమ పద్ధతిలో ఖర్చు చేయాలి. భవిష్యత్తు అవసరాలను ఊహిస్తూ పెట్టుబడులు పెట్టాలి. అప్పుడే మనకు తగిన భరోసా లభిస్తుంది. దీని కోసం కొన్ని సూత్రాలను పాటించాల్సిన అవసరం ఉంది. అవేమిటంటే.
30 శాతం: మీ క్రెడిట్ కార్డు పరిమితిలో ఎప్పుడూ 30 శాతానికి మించి వాడకూడదు.
ఉదాహరణకు మీ కార్డు పరిమితి రూ.1,00,000 ఉందనుకుందాం. నెలలో దీనిని రూ.30,000 మించి వాడకుండా జాగ్రత్త తీసుకోవాలి. ఎప్పుడైనా కాస్త అధికంగా వాడినా, నెల మధ్యలోనే ఆ మేరకు చెల్లించే ప్రయత్నం చేయాలి.
70 శాతం: ఇప్పుడు వస్తున్న ఆదాయంలో కనీసం 70 శాతం పదవీ విరమణ తర్వాతా వచ్చేలా ప్రణాళిక ఉండాలి.
ఉదాహరణకు ఇప్పుడు మీ నెల జీతం రూ.1,00,000 అనుకుందాం. పదవీ విరమణ చేసిన తర్వాత రూ.70,000 ఆదాయం ఉంటేనే ప్రస్తుత జీవన శైలిలో జీవించగలరు.
10-15 శాతం: మీ ఆదాయంలో 10-15 శాతాన్ని భవిష్యత్ అవసరాల కోసం మదుపు చేయాలి.
ఉదాహరణకు మీ నెల ఆదాయం రూ.80,000 ఉంటే ఇందులో కనీసం రూ.12,000 పెట్టుబడికి మళ్లించాలి.