తెలంగాణ

telangana

ETV Bharat / business

ఇండియన్ టెకీలకు కొత్త సవాల్! మనోళ్లకన్నా తక్కువ జీతాలకే ​ వియత్నాం సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు - india it jobs replacement - INDIA IT JOBS REPLACEMENT

Indian Techies Replaced With Vietnam Engineers : భారతీయ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లకు గడ్డు పరిస్థితులు ఎదురుకాబోతున్నాయి! అనేక అమెరికా టెక్​ కంపెనీలు మనవారిని తక్కువ ధరకే పనిచేసే వియత్నాం టెకీలతో రిప్లేస్​ చేయడమే అందుకు కారణం. ఈ మేరకు మారుతున్న పరిస్థితిని వివరిస్తూ ఓ ఇండియన్ టెకీ పెట్టిన పోస్టు వైరల్ అయింది.

Indian Techies Replaced With Vietnam WorkForce
Indian Techies Replaced With Vietnam WorkForce (ETV Bharat)

By ETV Bharat Telugu Team

Published : Jul 28, 2024, 12:30 PM IST

Indian Techies Replaced With Vietnam Engineers : భారత టెకీలకు కొత్త సవాళ్లు ఎదురుకాబోతున్నాయి! భారతీయుల కన్నా తక్కువ ధరకే పనిచేసేందుకు పలు ఆగ్నేయ ఆసియా దేశాల సాఫ్ట్​వేర్ ఇంజినీర్లు ముందుకొస్తున్నారు. దీంతో కొన్ని దశాబ్దాలుగా ఐటీ ఎగుమతుల్లో అగ్రగామిగా ఉన్న భారత్,​ ఆ స్థానం కోల్పోయే ప్రమాదాలు ఉన్నాయి. ఇండియన్ టెకీల ఉద్యోగాలకు ముప్పు పొంచి ఉంది. ఈ మేరకు భారతీయ సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లను, వియత్నాం చీప్​ వర్క్​ఫోర్స్​తో ఎలా రిప్లేస్​ చేస్తున్నారో వివరిస్తూ ఓ ఇండియన్​ టెకీ సోషల్ న్యూస్​ వెబ్​సైట్​ రెడిట్​లో​ పెట్టిన పోస్టు వైరల్​ అవుతోంది.

1990ల్లో ఐటీ బూమ్​ మొదలు ఈ రంగంలో భారత్​ గణనీయమైన వృద్ధి సాధించింది. దేశంలో అత్యుత్తమ నైపుణ్యం కలిగిన ఉద్యోగాలు కల్పిందించి కూడా ఈ రంగమే. అలా అమెరికా టెక్​ కంపెనీలకు భారతీయ ఐటీ కంపెనీలు ఔట్​సోర్సింగ్​ సేవలు మొదలుపెట్టాయి. అత్యున్నత నైపుణ్యం కలిగిన, ఇంగ్లీష్​ మాట్లాడే ఇంజినీర్లను అందించాయి. అమెరికా కంపెనీలు స్థానికంగా నియమించుకునే ఉద్యోగుల వేతనాల్లో కొంత మొత్తానికే భారతీయ నిపుణులు పనిచేసేవారు. అలా ఇండియన్ ఐటీ కంపెనీలు సేవలను విస్తృతం చేసి కొన్ని దశాబ్దాలుగా వేగంగా వృద్ధి చెందాయి.

అయితే ఇప్పుడు పరిస్థితులు మారుతున్నాయి. కొన్ని ఆగ్నేయ ఆసియా దేశాల్లో భారత్​ కన్నా తక్కువ ధరకే సాఫ్ట్​వేర్​ ఇంజినీర్లు పనిచేస్తున్నారు. ఫలితంగా అనేక అమెరికన్ కంపెనీలు తమ ఔట్​సోర్సింగ్​లో కొంత భాగాన్ని ఫిలిప్పీన్స్​, వియత్నాం వంటి దేశాలకు మార్చుకుంటున్నాయి. దీంతో భారత్​లో ఐటీ ఉద్యోగాలు ప్రభావితం అవుతున్నాయి.

ఇటీవల ఓ ఇండియన్ టెకీ రెడిట్​ ప్లాట్​ఫామ్​లో పెట్టిన పోస్టు మారుతున్న పరిస్థితికి అద్దం పడుతోంది. అందులో భారతీయ ఇంజినీర్లను వియత్నాం చీప్​ వర్క్​ఫోర్స్​తో ఎలా భర్తీ చేస్తున్నారో ఆ టెకీ వివరించాడు. "మేం ఓ క్లైంట్​ కోసం ఒకటిన్నర ఏళ్లుగా పనిచేస్తున్నాం. అంతా బాగానే నడుస్తోందన్న క్రమంలో, రెండు నెలల క్రితం వారు(క్లైంట్) భారత ఇంజినీరింగ్​ డైరెక్టర్​ను తీసేసి వియత్నాం నిపుణుడితో భర్తీ చేశారు. అప్పటి నుంచి పరిస్థితులు మారాయి. ఇండియన్​ డెవలపర్స్​తో పాటు క్లైంట్​కు పనిచేస్తున్న యూఎస్​కు చెందిన ఇంజినీర్లను కూడా తీసేశారు. అలా మా టీమ్ మొత్తాన్ని వియత్నాం డెవలపర్స్​తో భర్తీ చేశారు." అని ఆ టెకీ రాసుకొచ్చాడు.

ఈ పోస్టు పెట్టిన టెకీ చెప్పిన వివరాల ప్రకారం, భారతీయుల కంటే వియాత్నాం డెవలపర్స్​ తక్కువ ధరకే పనిచేస్తున్నారు. 12గంటలు పనిచేయడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. కానీ వారి ఇంగ్లీష్​ పరిజ్ఞానం అంతంత మాత్రమే. ఈ పోస్టు వైరల్​ కాగా, ఓ యూజర్​ "మనం ఇకపై చౌక వర్క్​ ఫోర్స్​ కాదు" అని అభిప్రాయం వ్యక్తం చేశాడు. మరో యూజర్ స్పందిస్తూ​ "మనం అమెరికన్ మిడ్-స్కిల్డ్ ఐటి ఉద్యోగాలను భర్తీ చేశాం. ఇప్పుడు మన ప్లేస్​లో వేరేవాళ్లను భర్తీ చేస్తున్నారు. జీవితం ఒక చక్రం" అని కామెంట్ రాశాడు.

'కేవలం ఐటీనే కాదు!'
అయితే ఇది ఐటీ రంగానికే పరిమితమైన అంశం కాదని మరో వ్యక్తి అన్నాడు. "మెరైన్ ఇంజినీరింగ్‌లో పనిచేసే నా సోదరుడు, వియత్నాం నుంచి చాలా వర్క్​ఫోర్స్​ వస్తోందని చెప్పాడు. ఎందుకంటే మనకంటే వారు చౌకగా పని చేస్తారు. మనందరినీ వియత్నాం వాళ్లతో రిప్లేస్ చేసేందుకు ఎంతో కాలం పట్టదు" ​అని తన అభిప్రాయం వ్యక్తం చేశాడు.

సాఫ్ట్​వేర్ ఇంజినీర్ ఉద్యోగమే మీ లక్ష్యమా? ఈ ఇంటర్వ్యూ టిప్స్ మీ కోసమే! - Software Engineering Interview Tips

మాక్ ఇంటర్వ్యూలకు ఎటెండ్​ కావాలా? ఈ టాప్​-4 ఫ్రీ వెబ్​సైట్స్​పై ఓ లుక్కేయండి!

ABOUT THE AUTHOR

...view details